రేపటి నుంచి అనంతలో లేపాక్షి ఉత్సవాలు - lepakshi utsavalu
అనంతపురం జిల్లాలో రేపటి నుంచి రెండ్రోజులపాటు ప్రభుత్వం 'లేపాక్షి వైభవం-2020' పేరుతో ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనుంది. దీనిలో భాగంగా ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ కలెక్టర్ గంధం చంద్రుడు ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాయలసీమ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.