ETV Bharat / state

అనంతపురంలో భారీ వర్షం...అన్నదాతకు భారీ నష్టం

అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో భారీ వర్షం కురిసింది. వాన బీభత్సానికి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. రహదారులపై నీరు చేరి వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు.

వర్షానికి నీటమునిగిన పంటలు
author img

By

Published : Oct 28, 2019, 7:45 PM IST

అనంతపురంలో వర్షానికి నీటమునిగిన పంటలు

అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని బొమ్మనహల్ మండలంలో అత్యధికంగా 104.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షానికి పలు ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. సుమారు 5 వేల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లిందని... పత్తి, వరి, మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షానికి రోడ్లపై నీరు చేరి వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు.

ఇదీ చదవండి:

అసభ్యంగా ప్రవర్తించాడని... చితకబాదారు

Reporter : j.sivakumar Rayadurgam Anantapuram, dist, ap 8008573082 * దుర్గం లో భారీ వర్షం స్తంభించిన జనజీవనం ఆనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాయదుర్గం పట్టణం మండలంతో పాటు డి హిరేహాల్, కనేకల్, గుమ్మగట్ట, బొమ్మనహల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా బొమ్మనహల్ మండలం లో 104.6 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది భారీ వర్షం రావడంతో బొమ్మనహల్ తాసిల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, మండల వనరుల కేంద్రం, విద్యుత్ కార్యాలయం, శ్రీ శక్తి భవన్, జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్తిగా వర్షం నీటితో మునిగాయి. పత్తి వరి మిరప పంట పూర్తిగా నీట మునిగి దెబ్బతిన్నాయి. వర్షం దెబ్బకు ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం తెరుచుకో లేని పరిస్థితి నెలకొంది బొమ్మనహల్ మండలం లో లో లో 5 వేల నుంచి ఆరువేల ఎకరాల్లో రైతులు సాగు చేసిన పత్తి, వరి, మిరప వంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో దాదాపు రెండు రెండు నుంచి మూడు కోట్లు దాకా రైతులు వివిధ పంటల వల్ల నష్టపోయారు మండల కేంద్రానికి ప్రయాణికులు రాకపోకలు సాగించే వ్యవస్థ దెబ్బతింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. అదేవిధంగా గుమ్మగట్ట మండల వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదయింది. కలుగోడు జే వెంకటం పల్లి తో పాటు ఇతర చెరువులు వాగులు వంకలు వరద నీటితో మునిగిపోయాయి. రహదారులు కోతకు గురికావడంతో రవాణా వ్యవస్థ దెబ్బతింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.