ETV Bharat / state

కాసేపట్లో.. రోడ్డుపైకి కి(న)యా కారు - kia

'మేడిన్ ఆంధ్రా' కియా కారు..... నేటి నుంచి భారతీయ రోడ్లపై పరుగులు పెట్టనుంది. అనంతపురం జిల్లాలోని పెనుకొండ వద్ద  కియా కార్ల పరిశ్రమలో నేటి నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఏటా మూడు లక్షల కార్లు ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమలో.... సెల్టోస్ మోడల్ కారును నేడు ఆవిష్కరించనున్నారు.

నేటి నుంచి రోడ్లపైకి కి(న)యా కారు
author img

By

Published : Aug 8, 2019, 5:42 AM IST

Updated : Aug 8, 2019, 12:42 PM IST

నేటి నుంచి రోడ్లపైకి కి(న)యా కారు

'మేడిన్ ఆంధ్రా' కియా కారు...నేటి నుంచి రోడ్లపై పరుగులు పెట్టనుంది. కియా పరిశ్రమ వాణిజ్య ఉత్పత్తులు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. స్టెలోస్ మోడల్ కారును మంత్రి బుగ్గన విడుదల చేయనున్నారు.

రెండు నెలలు ముందుగానే...

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటర్స్.. ఏడు వేల కోట్ల పెట్టుబడితో 11 వేల మందికి ప్రత్యక్ష్యంగా... మరికొన్ని వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో అనంతపురం జిల్లాలో పరిశ్రమ స్థాపించింది. 535 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమ ఏర్పాటైంది. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో భూమి కేటాయింపులు సహా పరిశ్రమ విద్యుత్, నీటి సౌకర్యం కల్పనతో కార్యకలాపాలు వేగంగా సాగాయి. నూతన ప్రభుత్వం సైతం కియా మోటర్స్ కు అవసరమైన సహకారం అందడంతో కార్ల మాస్ ప్రొడక్షన్ ను అనుకున్న సమయం కంటే ముందే లక్ష్యం సాధించింది. సంస్థలో తయారైన తొలి కారును ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా విడుదల చేయాలని భావించినా... ఆయన దిల్లీ పర్యటనలో ఉన్నందున ప్రభుత్వం తరపును ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సెల్టోస్ కారు మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు.

ఏటా మూడు లక్షల కార్లు

పెనుకొండలో ఏర్పాటైన కియా పరిశ్రమ... ఏటా మూడు లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యంతో తొలి దశలో మూడు మోడళ్లు మార్కెట్లోకి విడుదల చేయనుంది. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా Sయూవీ మోడల్ కారు విడుదల చేయించిన కియా యాజమాన్యం... ప్రస్తుతం సెల్టోస్ మోడల్‌తో మార్కెట్‌లోకి రానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 200కి పైగా డీలర్లను నియమించి... కార్ల విక్రయ షోరూమ్‌లను తెరిచింది.

ఇదీచదవండి

రెవెన్యూ లోటు భర్తీకి సాయం చేయండి: సీఎం జగన్

Intro:kit 736

కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం, చల్లపల్లిలో బిసి వసతిగృహం లో దాసరి ఆదిత్య హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ యం. రవీంద్రనాథ్ బాబు తెలిపారు

ఇదే హాస్టల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఈ
ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.

script FTP ద్వారా పంపడమైనది

Body:ఇదే హాస్టల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.

Conclusion:ఇదే హాస్టల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.
Last Updated : Aug 8, 2019, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.