ETV Bharat / state

'రైతులకు పశువులు దూరం-కరవే కారణం' - కరువు

తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పశువులకు గ్రాసం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఎంతో ప్రేమతో పశువులు పెంచే కర్షకులు... వాటిని పోషించలేక అమ్మకానికి తరలిస్తున్నారు. అనంతపురం మార్కెట్ యార్డ్‌లో నిత్యం వందల పశువులు కబేళాలకు తరలిపోతున్న దృశ్యం కన్నీళ్లు తెప్పిస్తోంది.

'రైతులకు పశువులు దూరం-కరువే కారణం'
author img

By

Published : Jul 24, 2019, 2:25 PM IST

'రైతులకు పశువులు దూరం-కరవే కారణం'
అనంతపురం జిల్లాను కరవు వెంటాడుతూనే ఉంది. పంటలు నష్టపోయి రైతులు అల్లాడిపోతుంటే, పశుగ్రాసం లేక జంతువులు ఆకలితో అలమటిస్తున్నాయి. వ్యవసాయంలో తమకు చేదోడువాదోడుగా ఉండే పశువుల ఆకలి కేకలు చూసి రైతు ఆవేదన చెందుతున్నాడు. గ్రాసం కొరతతో పశువులను కాపాడుకోలేక రైతులు వాటిని అమ్మేస్తున్నారు. మేత దొరకక ... పశువులను తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులను ఎంతో ప్రేమతో పెంచామని, వాటికి కనీసం మేత కూడా అందించలేక విక్రయిస్తున్నామని బోరుమంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రాయితీపై దాణా అందిస్తే పశువులను పెంచేందుకు చేయూత లభిస్తుందని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇసుక కొరత.. కూలీల ఉపాధికి గండి

Intro:Ap_vsp_48_24_court_lo_agnipramadam_av_AP10077_kbhanojirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి పాత కోర్టు భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది కోర్టు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అద్దె భవనంలో కి రెండేళ్ల క్రితం కోర్టును మార్చారు ప్రస్తుతం కోర్టు భవనంలో లో స్పెషల్ జుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు నిర్వహిస్తున్నారు

Body:ఇక్కడ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారిని విచారిస్తున్నారు ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో కోర్టు భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు కోర్ట్ లో ని రికార్డులన్నీ అగ్నికి ఆహుతయ్యాయిConclusion:పాత కోర్టు భవనానికి విద్యుత్ సదుపాయం లేదు దీని వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం లేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా అగ్ని ప్రమాదానికి కారణమైన ఉండొచ్చన్న అనుమానంతో విచారణ చేపడుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.