ETV Bharat / state

కలహాలతో నలుగురు ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి - గోరంట్ల

కుటుంబ కలహాలు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. మరో ఇద్దరు కొన ఊపిరితో ఉన్నారు. కుటుంబ కలహాలే నలుగురు ఆత్మహత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది.

కలహాలతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
author img

By

Published : May 8, 2019, 12:55 PM IST

అనంతపురం జిల్లా గోరంట్లలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి బలవన్మరణ యత్నానికి పాల్పడ్డారు. గోరంట్లకు చెందిన రామకృష్ణమ్మ గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. తమ్ముళ్లు మోహన్, సోమశేఖర్​, కుమారుడు వేణుగోపాల్​తో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో శ్మశాన వాటిక వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. ఆ ప్రాంతం ఊరికి దూరంగా ఉన్నందున ఉదయం వరకు ఎవరూ గుర్తించలేదు. 9 గంటల ప్రాంతంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే మోహన్, సోమశేఖర్​లు మృతి చెందినట్లు నిర్ధరించారు. రామకృష్ణమ్మ, అతని కుమారుడిని హిందూపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

మంత్రి పదవికి కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా..?

Intro:ఆమె ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధురాలు. ఆమె భర్త ఓ కవి. ఆమెకు ప్రభుత్వం నుంచి వితంతు పింఛను వస్తోంది. గత ఎనిమిదేళ్లుగా ఆమె పొందుతున్న పింఛన్ లో సగం మాత్రమే వినియోగిస్తోంది . తాజాగా గత నాలుగు నెలలుగా ఆమె తన పింఛను సొమ్ములో సగం మొత్తాన్ని పింఛను పొందని నిరుపేద కుటుంబానికి అందిస్తోంది. ఆ వృద్ధురాలు దాతృత్వం తెలియాలంటే ఇది చూడండి.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణానికి చెందిన ఆదివారపు పేట లో నివసిస్తున్న బనిశెట్టి పార్వతమ్మ అనే వృద్ధురాలు కు ఎనిమిదేళ్లుగా వితంతు పింఛను తీసుకొని జీవనం సాగిస్తోంది . 200 రూపాయల నుంచి అంచెలంచెలుగా పింఛన్ మొత్తం రెండు వేలకు చేరింది. తక్కువ పెంచిన ఉన్నప్పుడు ....ఎక్కువ పింఛను వస్తున్నప్పుడు .. ఆమెది ఒక్కటే లక్ష్యం . మానవసేవే మాధవ సేవ అంటూ తన పింఛన్ లోని సగం మొత్తాన్ని పింఛను నోచుకోని నిరుపేద కుటుంబానికి ఇవ్వడం గమనార్హం.

ఈ క్రమంలో నరసన్నపేట కు చెందిన చైతన్య భారతి అనే స్వచ్ఛంద సంస్థ పార్వతమ్మ సేవాభావాన్ని గమనించి ఓ నిరుపేద కుటుంబాన్ని ఎంపిక చేసింది . నరసన్నపేట లోని దేశవనిపేట వీధిలో ఉంటున్న దామోదర జగన్నాథం దంపతులను గుర్తించింది . దామోదర జగన్నాథం కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. వయస్సునమోదులో తేడా కారణంగా జగన్నాథంకు ఇప్పటివరకు పింఛను మంజూరు కాలేదు. ఇటీవల తన వయసు అర్హతకు సరిపోయినా మరో చుక్కెదురయింది. అది ఏంటంటే దామోదర జగన్నాథంకు సొంత ఇల్లు కూడా లేదు . కానీ సాధికార సర్వే లో ఆరు ఎకరాల భూమి ఉన్నట్టు నమోదైంది. దీంతో జగన్నాథంకు పింఛను మంజూరులో మరో సమస్య ఎదురైంది.

ఇలా ఇబ్బంది పడుతున్న దామోదర జగన్నాథం సమస్య భారతి సంస్థకు చేరింది. ఈ క్రమంలో
అటు పార్వతమ్మ ఉదారత్వం.... ఇటు జగన్నాథం జీవన సమస్య పరిష్కరించేందుకు నడుం కట్టింది . పార్వతమ్మను ఒప్పించి ప్రతి నెల ఆమె పింఛన్ లో సగభాగం జగన్నాథం కుటుంబానికి ఇవ్వ చూపింది . ఇలా గత నాలుగు నెలలుగా బని శెట్టి పార్వతమ్మ తన పింఛన్ లో సగం మొత్తాన్ని జగన్నాదం కుటుంబానికి నెల నెలా ఇస్తోంది. ఆమె ఆదర్శానికి నరసన్నపేట ప్రజలు ప్రశంసిస్తున్నారు

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.