అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో విద్యుదాఘాతంలో ఎద్దు మృత్యువాతపడింది. రెండు రోజుల క్రితం ఈదురుగాలులు, వర్షం రావడంతో విద్యుత్ స్తంభాలకున్న తీగలు తెగిపడ్డాయి. ఉదయాన్నే దుక్కి చేయడానికి వెళ్లిన రైతు.. ఈ విషయం గమనించకుండా అలాగే ముందుకు వెళ్లాడు. ఎద్దు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. తమ కుటుంబాన్ని పోషించే ఎద్దు మృతి చెందిదని రైతు పుల్లయ్య కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి: 'మానవ తప్పిదంతోనే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం!'