అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని బ్యాంకుల్లోని సిబ్బందికి కొన్ని రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో బ్యాంకులు కొన్ని రోజులు మూతపడ్డాయి. తిరిగి బ్యాంకులు తెరుచుకోవడంతో పంట రుణాల కోసం రైతులు, మహిళా సంఘాల లావాదేవీల కొరకు మహిళలు, వ్యాపార లావాదేవీలకు వ్యాపారస్తులు ఒక్కసారిగా ఎగబడుతున్నారు. బ్యాంకు సిబ్బంది కొవిడ్ నిబంధనల ప్రకారం వినియోగదారులకు సేవలు అందించాలి. సిబ్బంది మాత్రం దీనికి భిన్నంగా కేవలం క్యూలైన్లు నిలబెట్టి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించకుండానే లోపలికి పంపుతున్నారు.
వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు బారులు తీరిన క్యూలైన్లో నిల్చునే శక్తి లేక కిందనే కూర్చుండిపోతున్నారు. క్యూలైన్లలో నిలబడిన ప్రజలు భౌతిక దూరం పాటించే విధంగా చూడటంలో అక్కడి సిబ్బంది విఫలమయ్యారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. పంట రుణాల నవీకరణ కోసం బ్యాంకు సిబ్బందే గ్రామాలకు వచ్చి అక్కడే రెన్యూవల్ చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి లెక్కల్లోనే పడకలు.. చిక్కుల్లో రోగులు!
విజృంభిస్తున్న కరోనా.. బ్యాంకుల వద్ద పాటించని నిబంధనలు - Corona booming butTerms are not seen at banks
కరోన విజృంభిస్తున్నా బ్యాంకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కేవలం క్యూలైన్లు నిలబెట్టి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించకుండానే లోపలికి పంపుతున్నారు. ఇలాంటి అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని బ్యాంకుల్లో జరుగుతోంది.