ETV Bharat / state

ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం.. తన ఆటోకు తానే నిప్పు పెట్టిన కార్మికుడు - ఆటోడ్రైవర్

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓ ఆటోడ్రైవర్ కలకలం సృష్టించాడు. పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద తన ఆటోకు నిప్పు పెట్టాడు. పోలీసులు వెంటనే స్పందించి నిప్పు ఆర్పివేసి డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.

తన ఆటోకి నిప్పంటించుకున్న డ్రైవర్
author img

By

Published : Sep 29, 2019, 6:54 PM IST

తన ఆటోకి నిప్పంటించుకున్న డ్రైవర్

అనంతపురం జిల్లా పటపర్తిలోని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంటివద్ద తన ఆటోకి నిప్పు పెట్టుకుని కలకలం సృష్టించాడో డ్రైవర్. పట్టణానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ఆటో కార్మికుడు. పుట్టపర్తిలో సుమారు రెండు వందల వరకు ఆటోలు ఉండగా అందులో 100 ఆటోలకు మాత్రమే నంబర్లు కేటాయించారు. మిగిలిన ఆటోలను నిత్యం పోలీసులు తనిఖీ చేస్తుంటారు. ఈ కారణంగా.. డ్రైవర్లు ఇబ్బంది పడుతుంటారు. తమ ఆటోలకూ నెంబర్లు కేటాయించాలంటూ గత కొన్ని రోజులుగా డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ఎంతకూ స్పందించడం లేదని ఆరోపిస్తూ.. ఆయన ఇంటి వద్దే నాగేంద్ర తన ఆటోను తెచ్చి నిప్పు పెట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిప్పు ఆర్పివేసిన ఖాకీలు.. నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు. నాగేంద్ర ఎందుకు ఈ పని చేశాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

క్రేజ్ కోసం బైకులు తగలబెట్టారు... చివరకు!

Intro:ap_knl_22_29_death_av_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల నూనెపల్లె పై వంతెన కింద నిర్వహిస్తున్న ఓ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలింది. హోటల్లో వస్తువులు కాలి పోయాయి. అయితే ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి కొద్దీ దూరంలో సుబ్బయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడి తలపై గాయాలు తీవ్రంగా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి రాయి ఎగిరి అతని తలకు తగిలి మృతి చెందాడా, మరో కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు సుబ్బయ్యకు 50 ఏళ్లకు పైగా ఉంటాయి. మృతుడి చిరునామా తెలియాల్సి ఉంది

Body:వ్యక్తి మృతి

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.