Collector visit: అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కలెక్టర్ సుమిత్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. కనీసం రహదారి సౌకర్యం కూడా లేని ఈ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై పర్యటించారు.పెదబయలు మండలం మావో ప్రభావితం ఉన్న జామి గూడ, బూసిపుట్టు పంచాయతీల పరిధిలోని గ్రామాలను కలెక్టర్ సందర్శించారు. ముంచింగిపుట్టులో ఇద్దరు వ్యక్తులు అనుమతి లేని యాప్‌లతో లావాదేవీలు నిర్వహిస్తూ.. రైతులను మోసం చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వారిపై చర్యలకు ఆదేశించారు. ఏటీఎమ్‌లలో నగదు ఉండటం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన బ్యాంక్ మేనేజర్లతో మాట్లడి వారి నుంచి దీనిపై వివరణ కోరారు.
అనుమతి లేని ఏజెంట్ ఆధార్ కార్డులో మార్పులు, నవీకరణ పనులు చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం ఏజెంట్‌పై చర్యలకు ఉపక్రమించారు. బూసిపుట్ వరకు ప్రైవేటు జీపులో వెళ్లి అక్కడ నుంచి ద్విచక్ర వాహనంలో జామిగూడ గ్రామం సందర్శించారు. బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించి మార్చి నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. చాలాచోట్ల ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయులు వారానికి ఒక్కరోజే వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారని గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వారిపై కలెక్టర్ సుమిత్ చర్యలకు ఉపక్రమించారు. కొజ్జారిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు పనులు చేపట్టకపోవడంపై అధికారులను నివేదిక కోరారు.
ఇవీ చదవండి: