టోక్యో పారాఒలింపిక్స్‌లో సంచలనం నమోదైంది. ఎయిర్‌రైఫిల్ విభాగంలో భారత మహిళా షూటర్ అవని లేఖారా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో సత్తా చాటిన అవని.. టోక్యో పారాఒలింపిక్స్‌లో తొలి స్వర్ణాన్ని భారత్‌కు అందించింది.
ఆదివారం ఒక్కరోజే భారత్ మూడు పతాలను కైవసం చేసుకోగా.. సోమవారం(ఆగస్టు 30) వచ్చిన స్వర్ణంతో కలిపి భారత పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.