ETV Bharat / sports

ఒలింపిక్స్​లో సింధు శుభారంభం.. తొలి మ్యాచ్​​లో విజయం - సింధు తొలి రౌండ్​ లో విజయం

టోక్యో ఒలింపిక్స్​లో భారత స్టార్ షట్లర్​ పీవీ సింధు శుభారంభం చేసింది. ఇజ్రాయెల్​కు చెందిన పోలికర్పోవాను వరుస సెట్లలో ఓడించింది. 28 నిమిషాల్లోనే మ్యాచ్​ ముగించింది.

pv sindu
పీవీ సింధు
author img

By

Published : Jul 25, 2021, 7:46 AM IST

Updated : Jul 25, 2021, 9:10 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో భారత స్టార్ షట్లర్​ పీవీ సింధు బోణీ కొట్టింది. బ్యాడ్మింటన్​ మహిళల సింగిల్స్​ గ్రూప్‌-జె తొలి మ్యాచ్​లో ఆరో సీడ్​గా బరిలో దిగిన తెలుగు తేజం.. ఇజ్రాయెల్​కు చెందిన 58వ ర్యాంక్​ పోలికర్పోవాను వరుస సెట్లలో ఓడించింది. 21-7, 21-10 తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ 28 నిమిషాల్లోనే ముగియడం విశేషం. ​

తన రెండో మ్యాచ్​ను హాంకాంగ్​కు చెందిన ప్రపంచ నెం.34 చెంగ్​ నాన్​ యితో(Cheung Ngan Yi) ఆడనుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్​లో రజతం సాధించిన సింధు.. ఈసారి కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగింది.

వాళ్లకు మిశ్రమం..

శనివారం జరిగిన పురుషుల డబుల్స్​ గ్రూప్​ ఏ మ్యాచ్​లో భారత జోడీ సాత్విక్​సాయిరాజ్​, చిరాగ్​ శెట్టి.. చైనా ద్వయం యంగ్​ లీ, చిలిన్​ వాంగ్​ను ఓడించింది. పురుషుల సింగిల్స్​ తొలి మ్యాచ్​లో సాయి ప్రణీత్​.. మిషా జిల్బర్​మన్(ఇజ్రాయెల్​)​ చేతిలో ఓటమి చెందాడు.

ఇదీ చూడండి: 'ఒలింపిక్స్​కు ముందు నా కోచ్​తో ప్రాక్టీస్ చాలు'​

Last Updated : Jul 25, 2021, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.