టోక్యో ఒలింపిక్స్‌లో రెండో రోజు(జులై 24) జరగనున్న 10 క్రీడల్లో భారత అథ్లెట్లు పాల్గొననున్నారు. అందులో ఆర్చరీ మిక్స్డ్ ఎలిమినేషన్ రౌండ్లో ప్రవీణ్ జాదవ్, దీపికా కుమారి ఆడనున్నారు. మరోవైపు భారత పురుషుల హాకీ టీమ్ న్యూజిలాండ్ జట్టుతో పోటీ పడనుంది.
వీరితో పాటు మహిళల హాకీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, పెడ్లింగ్, రోవింగ్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో భారథ అథ్లెట్లు పాల్గొననున్నారు.
బరిలో తెలుగు తేజాలు
శనివారం జరగనున్న టెన్నిస్ పోటీల్లో తెలుగు తేజాలు బరిలో దిగనున్నాయి. టెన్నిస్ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా, అంకితా రైనా ఆడనుండగా.. పురుషుల సింగిల్స్‌లో సుమిత్ నగాల్ పోటీపడనున్నాడు.
మరోవైపు బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ద్వయం పోటీ పడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 8.50 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో సాయప్రణీత్ ఆడనున్న మ్యాచ్.. ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.
టోక్యో ఒలింపిక్స్ రెండో రోజు(జులై 24) భారత అథ్లెట్లు పాల్గొనే పోటీల షెడ్యూల్
ఇదీ చూడండి.. తొలి రోజు.. పతక వేటలో భారత ఆర్చర్లు