ETV Bharat / sports

Olympics: టీమ్​గా నిరాశపర్చారు.. సింగిల్స్​లో మాత్రం! - భారత ఆర్చరీ ఫలితాలు

ఒలింపిక్స్​లో ఆర్చరీ మిక్స్​డ్​ పోటీల్లో భారత జట్టు నిరాశపరిచింది. పురుషులు, మిక్స్​డ్​ బృంద పోటీల్లో చివరి వరకు ఆడలేకపోయింది. మరి పురుషుల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో మన అథ్లెట్లు ఏం చేస్తారో?

archery
ఆర్చరీ
author img

By

Published : Jul 26, 2021, 12:19 PM IST

టోక్యో ఒలింపిక్స్​ విలువిద్య బృంద పోటీల్లో భారత్‌ కథ ముగిసింది. పురుషుల బృంద పోటీల్లో అతాను దాస్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌తో కూడిన జట్టు తొలి మ్యాచ్​లో గెలిచినప్పటికీ క్వార్టర్​ ఫైనల్స్​లో వెనుదిరిగింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌, బలమైన కొరియా చేతిలో 6-0 తేడాతో ఓటమి పాలైంది. టీమ్‌ఇండియా వరుసగా మూడు సెట్లలో తేలిపోయింది.

మిక్స్​డ్​ టీమ్​

అంతకుముందు మిక్స్​డ్​ టీమ్​ విభాగంలోనూ ఇదే కథ. తొలి దశలో ప్రవీణ్​ జాదవ్​, దీపికా కుమారితో కూడిన భారత జట్టు​ వరుస సెట్లలో 5-3 తేడాతో గెలిచినప్పటికీ... క్వార్టర్ ఫైనల్​లో దక్షిణ కొరియాపై 6-2తేడాతో ఓడింది. ఇక భారత క్రీడాకారులు వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో ఏమైనా పతకాలు సాధిస్తారేమో చూడాలి.

ఇదీ చూడండి: Olympics: ఓడినా సరే చరిత్రలో నిలిచిపోయిన భవానీ దేవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.