ETV Bharat / sports

'అదితి వల్ల ఇండియా గోల్ఫ్​ నేర్చుకుంటుంది' - గోల్ఫర్​ అదితి అశోక్​

ఒలింపిక్స్​ గోల్ఫ్​లో సత్తా చాటి దేశ ప్రజల చూపు ఆకర్షించింది భారత గోల్ఫర్​ అదితి అశోక్​(Aditi Ashok olympics 2021). ప్రస్తుతం ఆదితిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదితి వల్ల దేశం గోల్ఫ్​ నేర్చుకుంటుందని అంటున్నారు.

aditi ashok
అదితి అశోక్​
author img

By

Published : Aug 7, 2021, 10:16 AM IST

అదితి అశోక్​.. రెండు, మూడు రోజుల ముందు వరకు భారతీయులకు పెద్దగా తెలియని పేరు ఇది. కానీ ఇప్పుడు అదితి పేరు మారుమోగిపోతోంది. ఒలింపిక్స్​ గోల్ఫ్​ పోటీల్లో అదితి(Aditi Ashok olympics 2021) పతకం సాధించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. తుపాను హెచ్చరికల మధ్య జరుగుతున్న ఈ ఈవెంట్​లో అదితి గెలవాలని యావత్​ ఇండియా ప్రార్థిస్తోంది. ఇక సామాజిక మాధ్యమాల్లో అదితిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇందులో కొన్ని ట్వీట్స్​ ఆసక్తికరంగా ఉన్నాయి.

"భారతీయులు ఉదయాన్నే లేచి.. గోల్ఫ్​ను ఆసక్తిగా చూడటం బహుశా ఇదే తొలిసారేమో! చాలా మందికి కనీసం గోల్ఫ్​ రూల్స్​ కూడా తెలియవు. వారిలో ఇంత ఆసక్తి కలగడానికి కారణమైన అదితికి ధన్యవాదాలు" అంటూ ఓ నెటిజన్​ ట్వీట్​ చేశాడు.

  • This might be the first time that whole India is watching a game of golf early morning with so much interest. Many are not even aware about the rules and scoring but Thanks to @aditigolf , today I think many of us learnt something new today 🇮🇳👏❤️#AditiAshok #Golf #tokyo2020 pic.twitter.com/oKrUiADV7h

    — Gautam Sachdeva (@GautamSachdevaa) August 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"1983లో కపిల్​ దేవ్​ ప్రపంచకప్​ను ముద్దాడినప్పుడు ఇండియా క్రికెట్​ నేర్చుకుంది.. అభినవ్​ పసిడి దక్కించుకున్నప్పుడు ఇండియా షూటింగ్​ నేర్చుకుంది. ఒలింపిక్స్​లో సైనా నెహ్వాల్​ పతకం సాధించినప్పుడు ఇండియా బ్యాడ్మింటన్​ నేర్చుకుంది. ఇక ఇప్పుడు అదితి అశోక్​ వల్ల భారత దేశం గోల్ఫ్​ నేర్చుకుంటుంది," అని మరొకరు ట్వీట్​ చేశారు.

23ఏళ్ల అదితి కర్ణాటకవాసి. 2016 ఒలింపిక్స్​లో అరంగేట్రం చేసింది. 2020లో భారత ప్రభుత్వం అర్జున అవార్డును అందించింది. ఈ టోక్యో ఒలింపిక్స్​లో సత్తా చాటి, దేశ ప్రజల చూపు తనవైపు తిప్పుకుంది.

ఇదీ చూడండి:- 'ఈ ఓటమి గెలుపుతో సమానం.. వాళ్ల ఆట అద్భుతం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.