ETV Bharat / sports

పారాలింపిక్స్​లో ఆడాలనుంది- అఫ్గాన్​ క్రీడాకారిణి ఆవేదన - Zakia Khodadadi

టోక్యో పారాలింపిక్స్​లో పాల్గొనేందుకు తనకు సాయం చేయలంటూ అఫ్గానిస్థాన్​కు చెందిన క్రీడాకారిణి జకియా ఖోదాదాది ప్రపంచ దేశాలను అభ్యర్థించింది. తన దేశం తరఫున విశ్వక్రీడల్లో ప్రాతినిధ్యం వహించే తొలి పారా క్రీడాకారిణిగా ఘనత సాధించాలనే ఆశయంతో ఉన్నట్లు ఆమె వెల్లడించింది.

Female Afghan athlete makes plea for help to get to Tokyo
టోక్యో చేరుకునేందుకు సహాయం చేయండి: అఫ్గాన్​ క్రీడాకారిణి
author img

By

Published : Aug 19, 2021, 10:41 AM IST

అఫ్గానిస్థాన్​కు చెందిన పారా అథ్లెట్​ జకియా ఖోదాదాది.. ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు సాయం చేయాలని ప్రపంచదేశాలతో పాటు మహిళా సంరక్షణా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. పారాలింపిక్స్​లో తన దేశం తరఫున తొలి పారా క్రీడాకారిణిగా ఘనత సాధించాలనే ఆశయంతో ఉన్నట్లు ఆమె వెల్లడించింది.

"మా అఫ్గానిస్థాన్ పౌరుల తరఫున ఓ మహిళగా నేను వేడుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని కాపాడండి. నాకు ​టోక్యో పారాలింపిక్స్​ 2020లో పాల్గొనాలని ఉంది. నా చేతులు పట్టుకొని నన్ను ఈ చెర నుంచి విడిపించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలతో పాటు మహిళా హక్కుల సంరక్షకులను ఓ మహిళగా అభ్యర్థిస్తున్నాను. పారాలింపిక్స్​లో అఫ్గానిస్థాన్​ తరఫున ప్రాతినిధ్యం వహించే ఆశలను అంత త్వరగా కోల్పోనివ్వకండి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు మనమే సహాయపడాలి. ఇప్పటివరకు మనం ఎన్నో సాధించాం. ఇప్పుడు దీన్ని చిన్న విషయంగా పరిగణించవద్దు. నా పోరాటం ఫలించదని.. దాని వల్ల ఎలాంటి ఫలితం ఉండదని నేను భావించను. నాకు సహాయం చేయండి".

- ఖోదాదాది, అఫ్గానిస్థాన్​ పారా-తైక్వాండో అథ్లెట్​

అఫ్గానిస్థాన్​కు చెందిన 23ఏళ్ల ఖోదాదాది.. షెడ్యూల్​ ప్రకారం పారాలింపిక్స్​లో పాల్గొనేందుకు మంగళవారం టోక్యోకు బయల్దేరాల్సిఉంది. కానీ, ఆ దేశంలో అనిశ్చితి కారణంగా విమాన ప్రయాణానికి అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు.

ఇదీ చూడండి.. దుమ్ములేపిన భారత అథ్లెటిక్స్‌ జట్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.