ETV Bharat / sports

Olympics: కొలనులో కొత్త చేప

ఒలింపిక్స్‌ కొలనులో కొత్త చేప వచ్చింది. స్విమ్మింగ్‌లో సంచలనాలు సృష్టిస్తూ.. టోక్యోలో ఇప్పటికే రెండు స్వర్ణాలతో సత్తాచాటిన ఆ మెరుపు తీగ మరిన్ని పతకాలు సాధించే దిశగా సాగుతోంది. తన తొలి ఒలింపిక్స్‌లోనే మహిళల వ్యక్తిగత విభాగాల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్లను వెనక్కినెడుతూ.. అగ్రశ్రేణి స్విమ్మర్లను దాటేస్తూ.. నీటిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకీ ఎవరామె? ఏయే విభాగాల్లో పతకాలు సాధిస్తోంది?

Ariarne Titmus
ఆరియాన్‌ టిట్మస్‌
author img

By

Published : Jul 29, 2021, 7:46 AM IST

ఈ సారి విశ్వ క్రీడల మహిళల స్విమ్మింగ్‌లో సంచలనాలు సృష్టిస్తుందని.. పసిడి పంట పండిస్తుందని అమెరికా భామ లెడెకీపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. గత రియో ఒలింపిక్స్‌లో ఆమె నాలుగు స్వర్ణాలు సహా మొత్తం ఐదు పతకాలు గెలవడమే అందుకు కారణం. కానీ సోమవారం మహిళల వ్యక్తిగత 400మీ. ఫ్రీస్టైల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన లెడెకీని వెనక్కినెట్టి అనూహ్యంగా పసిడి పట్టేయడం వల్ల ఒక్కసారిగా అందరిలోనూ ఆశ్చర్యం. నివ్వెరబోయిన స్విమ్మింగ్‌ ప్రపంచం కొత్త విజేతను సగర్వంగా ఆహ్వానించింది. ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం సాధించిన ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే బుధవారం 200మీ. ఫ్రీస్టైల్‌లో బరిలో దిగిన టిట్మస్‌.. మళ్లీ స్వర్ణం కొట్టేసి మరింత సంతోషంలో మునిగిపోయింది. ఫైనల్లో ఒక్క నిమిషం 53.50 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె సరికొత్త ఒలింపిక్స్‌ రికార్డు నెలకొల్పింది. బెర్నాడెట్టె (హాంకాంగ్‌- 1:53.92సె), ఒలెక్సియాక్‌ (కెనడా- 1:54.70) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. లెడెకీ (1:55.21సె) ఐదో స్థానానికే పరిమితమైంది.

టెర్మినేటర్‌

ఆస్ట్రేలియా దక్షిణ తీరంలోని టస్మేనియా ద్వీపానికి చెందిన టిట్మస్‌ ఏడేళ్ల నుంచి ఈత కొట్టడం మొదలెట్టింది. నెమ్మదిగా కొలనులో సంచలనాలు సృష్టించడం అలవాటు చేసుకుంది. మెరుగైన శిక్షణ కోసం 14 ఏళ్ల వయసులో ఆమె కుటుంబంతో కలిసి క్వీన్స్‌ల్యాండ్‌కు మకాం మార్చింది. 2016లో ఆస్ట్రేలియా జాతీయ జట్టయిన డాల్ఫిన్స్‌ స్విమ్మింగ్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్న ఆమె 2017 ప్రపంచ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మహిళల 4×200మీ. రిలేలో స్వర్ణం సొంతం చేసుకుంది. 2018 ఫినా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 200మీ. 400మీ. ఫ్రీస్టైల్‌లో బంగారు పతకాలు నెగ్గింది. అదే ఏడాది కామన్వెల్త్‌ క్రీడల్లో మూడు స్వర్ణాలు కొల్లగొట్టింది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ 400మీ. ఫ్రీస్టైల్‌లో 15 సార్లు ఛాంపియన్‌ లెడెకీని ఓడించి విజేతగా నిలిచింది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో వరుసగా 400మీ, 200మీ. రేసుల్లో స్వర్ణాలు గెలిచి ఆ ఘనత సాధించిన మూడో ఆస్ట్రేలియా స్విమ్మర్‌గా నిలిచింది. ఎప్పుడూ లక్ష్యంపైనే గురి నిలిపే టిట్మస్‌ను ముద్దుగా 'టెర్మినేటర్‌' అని పిలుస్తారు. ఒలింపిక్స్‌లో ఏకాగ్రత చెదరకుండా ఉండేందుకు తన ఫోన్‌లోని అన్ని సామాజిక మాధ్యమాల యాప్‌లను ఆమె తొలిగించింది. పోటీలకు ముందు సంగీతం వింటానని చెప్తున్న తను.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇదే మార్గమని తెలిపింది. ఈ ఒలింపిక్స్‌లో ఇంకా 800మీ. ఫ్రీస్టైల్‌, 4×200మీ. రిలేలో ఆమె పోటీపడాల్సి ఉంది. ఇప్పటికీ తన ప్రయాణం సగం మాత్రమే పూర్తయిందని పేర్కొన్న టిట్మస్‌.. మిగతా విభాగాల్లోనూ స్వర్ణాలు సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈతలో ఒహషి మోత

సొంతగడ్డపై ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌లో జపాన్‌కు ఓ కొత్త బంగారు చేప దొరికింది. ఆ దేశ స్విమ్మర్‌ ఒహషి యూ కొలనులో సంచలనం సృష్టిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే రెండు స్వర్ణాలను ఖాతాలో వేసుకుంది. సోమవారం వ్యక్తిగత మహిళల 400మీ. మెడ్లీలో పసిడి గెలిచిన ఆమె.. తాజాగా బుధవారం 200మీ. మెడ్లీలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్లో 2 నిమిషాల 8.52 సెకన్లలో రేసు ముగించిన ఆమె బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. అమెరికా స్విమ్మర్‌ కేటీ లెడెకీ ఎట్టకేలకు ఓ పసిడిని ముద్దాడింది. కొత్తగా ప్రవేశపెట్టిన మహిళల 1500మీ. ఫ్రీస్టైల్‌లో ఆమె ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో 15 నిమిషాల 37.39 సెకన్లలో ఆమె రేసును ముగించింది.

ఇదీ చూడండి: నిరాడంబరతకు నిలువుటద్దం ఈ 'మణిపూస'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.