ETV Bharat / sports

నన్ను వాచ్​మన్ అని పిలిచేవారు: సోమ్​దేవ్ - టెన్నిస్​ స్టార్​ సోమదేవ్​ దేవ్​వర్మన్​

భారత్​లో జాతి వివక్ష ఉందని ఆరోపించాడు టెన్నిస్‌ ఆటగాడు సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌. గతంలో తనను 'చైనీస్'​ అని హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దక్షిణాది రాష్ట్రాల్లో నల్లగా ఉన్న వాళ్లను కూడా ఆటపట్టిస్తారని వెల్లడించాడు.

Tennis star Somdev Devvarman
సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్
author img

By

Published : Jul 14, 2020, 8:05 AM IST

భారత్‌లోనూ జాతి వివక్ష ఉందని ఆరోపించాడు భారత టెన్నిస్‌ ఆటగాడు సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌. తాను ఈశాన్య రాష్ట్రాలకు చెందినవాడు కావడం వల్ల చైనా వాడని పిలిచేవారని ఆవేదన వ్యక్తం చేశాడు.

Tennis star Somdev Devvarman
సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్

"నేను ఈశాన్య రాష్ట్రం నుంచి వచ్చా. నాకు ఎనిమిదేళ్ల వయసులో మా కుటుంబం చెన్నైకి వలస వచ్చింది. చిన్నప్పుడు నన్ను కొంతమంది వాచ్‌మన్‌ అని పిలిచేవాళ్లు. బహుదూర్‌ అనేవాళ్లు. అప్పుడు చాలా బాధగా అనిపించేది. భారత్‌లో ఉన్నాం కాబట్టి వర్ణ వివక్ష, జాతి వివక్ష ఉండదనుకుంటే పొరపాటే. దక్షిణాదిన నల్లగా ఉన్న వాళ్లను ఆటపట్టిస్తుంటారు. కోల్‌కతాలో ఓసారి అయిదారుగురు పిల్లలు నన్ను 'చైనీస్‌' అని పిలిచి వాళ్లలో వాళ్లే నవ్వుకున్నారు. అప్పుడు నా భార్య వాళ్లను కొట్టాలని అనుకుంది. వాళ్లతో కలిసి ఆడి వారి తప్పు తెలిసేలా చేశాం"

- సోమదేవ్‌, భారత టెన్నిస్‌ ఆటగాడు

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించాడు సోమ్‌దేవ్‌.

ఇది చూడండి : ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్‌.. కరోనానే కారణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.