క్రికెట్‌లో ఎప్పుడు ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు బ్యాట్స్‌మన్ ఆడిన షాట్లకు ఏ ఫీల్డరో క్యాచ్ పడితే.. అది కాస్తా నోబాల్‌గా నమోదైతే.. ఆ ఆటగాడు లక్కీగా బతికిపోతాడు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు మనం క్రికెట్ మైదానాల్లో చూస్తూనే ఉంటాం. కానీ, తాజాగా న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో అంతకన్నా ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకొని ఓ బ్యాట్స్‌మన్ ఔటవ్వకుండా తప్పించుకున్నాడు. ఆ వివరాలేంటో తెలిస్తే మీరూ ముక్కున వేలేసుకుంటారు. అందుకు కారణం అంపైర్ అలీందార్.
అంతర్జాతీయ క్రికెట్‌లో అలీందార్ అనే అంపైర్ చాలా బాగా సుపరిచితమే. ఎన్నో మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసి మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఈ సంఘటనతో క్రికెట్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేశారు. బుధవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఐర్లాండ్ బ్యాట్స్‌మన్ సిమి సింగ్ (11) పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా న్యూజిలాండ్ పేసర్ బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో సిమి ఆడిన ఓ బంతిని కీపర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ ఆటగాళ్లంతా వికెట్ దక్కిందని సంబరపడ్డారు. అక్కడున్న అంపైర్ కూడా ఔటిచ్చాడు. కానీ మరో అంపైర్ అలీందార్ దాన్ని నాటౌట్‌గా పేర్కొన్నారు. ఎందుకంటే టిక్నర్ ఆ బంతిని విసిరేముందు తన ప్యాంట్‌కు పెట్టుకున్న కర్చీఫ్ కిందపడిపోయింది. అది బ్యాట్స్‌మన్ దృష్టిని మరల్చే అవకాశం ఉండటంతో అంపైర్ నాటౌటిచ్చాడు.
క్రికెట్ నిబంధనల 20.4.2.7 క్లాజ్ ప్రకారం.. ఎవరైనా బౌలర్ బౌలింగ్ చేసేటప్పుడు బ్యాట్స్‌మన్ దృష్టి మరల్చే వీలున్న పరిస్థితులు ఏర్పడితే అంపైర్ ఆ బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనల ప్రకారమే అలీందార్.. సిమి సింగ్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్, బౌలర్ టిక్నర్ ఆ అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. ఆ కర్చీఫ్ కిందపడిన సంఘటన వల్ల సిమి సింగ్ ఏమాత్రం ప్రభావితం కాలేదు. అయినా అంపైర్ నిబంధనల ప్రకారం నాటౌట్‌గా ప్రకటించాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ విచిత్రమైన సంఘటన మీరూ చూసి ఆస్వాదించండి.
- — ParthJindalClub (@ClubJindal) July 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
— ParthJindalClub (@ClubJindal) July 13, 2022
">— ParthJindalClub (@ClubJindal) July 13, 2022
ఇదీ చదవండి: కోహ్లీకి ఒకరు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు: రోహిత్