ETV Bharat / sports

నేటి నుంచే ఆన్‌లైన్‌ నేషన్స్‌ చెస్‌

ఆన్​లైన్​ నేషన్స్​ చెస్​ టోర్నీ నేడు జరగనుంది. ఈ పోటీల్లో తెలుగు తేజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ తదితరులు పాల్గొననున్నారు.

Viswanathan Anand To Lead India At Online Nations Cup Chess Tournament
నేటి నుంచే ఆన్‌లైన్‌ నేషన్స్‌ చెస్‌
author img

By

Published : May 5, 2020, 8:23 AM IST

ఆన్‌లైన్‌ నేషన్స్‌ చెస్‌ టోర్నీకి వేళైంది. నేడు జరుగబోయే ఈ పోటీల్లో తెలుగు తేజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ ఆడనున్నారు. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ నాయకత్వం వహిస్తున్న ఈ జట్టులో విదిత్‌ గుజరాతి, అధిబన్‌ కూడా ఉన్నారు.

భారత బృందానికి వ్లాదిమిర్‌ క్రామ్నిక్‌ సలహాదారుగా వ్యవహరించనున్నాడు. చైనా, రష్యా, అమెరికా, ఐరోపా, రెస్ట్‌ ఆఫ్‌ వరల్డ్‌ జట్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నాయి. ఆరు జట్లు ఆడుతున్న ఈ కప్‌లో పోటీలు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగుతాయి. లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు టైటిల్‌ కోసం 'సూపర్‌ ఫైనల్‌'లో తలపడతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.