ETV Bharat / state

ఊరంతా తరలి వెళ్లిపోతోంది - పల్లె కన్నీరు పెడుతోంది - FORMERS ARE MIGRATED FOR WORK

పడిపోయిన పంట దిగుబడులు - జీవనోపాధి కోసం తరలిపోతున్న జనం - వెలవెలబోతున్న పల్లెలు, వీధులు - కర్నూలు జిల్లాలో ఈ ఏడాదీ గ్రామాలు ఖాళీ

PEOPLE MIGRATED TO OTHER STATES
RAYALASEEMA VILLAGE HOUSES (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2024, 2:25 PM IST

Updated : Nov 1, 2024, 3:26 PM IST

People Are Migrating Rayalaseema in AP : ఆంధ్రప్రదేశ్​లోని రాయలసీమ ప్రజలు మళ్లీ వలస బాట పట్టారు. ఈ ఏడాదీ గ్రామాలన్నీ దాదాపుగా ఖాళీ అయ్యాయి. పల్లెలన్నీ జనం లేక నిశ్శబ్దంతో వెలవెలబోతున్నాయి. పాఠశాలలు పిల్లలు లేక బోసిపోతున్నాయి. వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం, ఆశించిన మేరకు పంటలు పండకపోవడం వలసలకు ప్రధాన కారణమైంది.

పెట్టుబడులు రాక : కర్నూలు జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడిన వారిపై గత ఐదేళ్లు వరుసగా కరవు తాండవించింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాలు చాలా ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత వర్షాలు ఎక్కువగా కురవడంతో పంటలు ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి. ఫలితంగా కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఎమ్మిగనూరు, కౌతాళం, కోసిగి, హాలహర్వి, చిప్పగిరి, పెద్దకడబూరు, మంత్రాలయం, కోడుమూరు మండలాల్లో వలసలు మరింత పెరిగాయి. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవటంతో అన్నదాతలు ఆరుకాలం పడ్డ కష్టం వృథా అయి దిగుబడులు పడిపోయాయి. చాలా మంది రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు. గ్రామాల్లో ఎలాంటి పనులు లేక ఏంచేయాలో దిక్కుతోచని రైతులు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. వృద్ధులను ఇళ్ల వద్ద వదిలి గ్రామాల నుంచి పొట్టచేతపట్టుకొని పోయారు.

పశుసంపదను అమ్ముకుని : వ్యవసాయ కూలీలు ఇంకా వలస వెళ్తున్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వలసలు మరింత ఎక్కువ అయ్యాయి. గ్రామాలన్నీ ఖాళీగా, ఎండిపోయిన ఆకుల్లా కనిపిస్తున్నాయి. ఏ వీధిలో చూసినా అందరీ ఇళ్లకు తాళాలే కనిపిస్తున్నాయి. వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూతపడ్డాయి. అక్కడక్కడా వృద్ధులు, చిన్న పిల్లలు మాత్రమే కంటికి కనిపిస్తున్నారు. పనిచేయగలిగిన వారంతా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు వలస వెళ్లిపోయారు. కొందరు పంట పొలాల్లో పనిచేయటానికి వెళ్లగా, మరికొంతమంది భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేయడాానికి వెళ్లారు. తమకున్న పశువులు ఎద్దులు, ఆవులను సైతం అమ్ముకుని వెళ్లినట్లు ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

చదువుపై వలసల ప్రభావం : రాయలసీమ వలసల ప్రభావం ఆ ప్రాంత చిన్నారుల చదువులపై తీవ్రంగా పడుతోంది. రైతులు తమతోపాటు పిల్లలను కూడా తీసుకెళ్తున్నారు. గ్రామాల్లో విద్యార్థులకు వసతి గృహం లేకపోవటం, పిల్లలకూ కూలీ వస్తుండటంతో తల్లిదండ్రులు వారిని తమతో తీసుకెళ్తున్నారు. దీంతో ఇక్కడి పాఠశాలల్లో హాజరు శాతం భారీగా తగ్గిపోతోంది. 80 శాతం మంది పిల్లలు వలసకు వెళ్తున్నారంటే పరిస్థితి తీవ్రతను చాలా అర్థం చేసుకోవచ్చు. వలస ప్రభావిత గ్రామాల్లోని పాఠశాలలన్నీ విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తిన వరదలు కష్టాలు - కేంద్రంపైనే భారం - Prathidhwani on Flood Victims

రైతులు, ప్రజల కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమే: కేటీఆర్

Last Updated : Nov 1, 2024, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.