ETV Bharat / technology

వాట్సాప్​లో మరో ఇంట్రస్టింగ్ ఫీచర్- ఎలా ఉపయోగించాలంటే?

వాట్సాప్​లో సరికొత్త కస్టమ్​ లిస్ట్ ఫీచర్​- ఇకపై నచ్చినట్లుగా చాట్ ఫిల్టర్లు..!

WhatsApp Introduces New Feature
WhatsApp Introduces New Feature (ANI)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 1, 2024, 2:31 PM IST

WhatsApp New Custom Lists Feature: ప్రముఖ ఇన్​స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్​ యూజర్లకు మెరుగైన ఎక్స్​పీరియన్స్ అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో కమ్యూనికేషన్ అనుభవాన్ని ఇంప్రూవ్ చేసేందుకు తాజాగా మరో కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. కస్టమ్​ లిస్ట్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ సాయంతో యూజర్లకు నచ్చినట్లు చాట్స్​ను ఫిల్టర్ చేసుకోవచ్చు.

ఇది ఎలా ఉపయోగపడుతుంది?:

  • వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకు చాలా కాంటాక్ట్స్ దర్శనమిస్తుంటాయి.
  • అందులోనే ఫ్రెండ్స్, పర్సనల్, వృత్తిపరమైన లేదా వ్యాపారానికి సంబంధించినవి అన్నీ కలిసే ఉంటాయి.
  • అందులో మనకు కావాల్సిన వ్యక్తితో చాట్ చేయాలంటే అంత పెద్ద లిస్ట్​లో వెతుక్కోవాల్సి వస్తుంది.
  • లేదా సెర్చ్​ బార్​ను ఉపయోగించి వెతుక్కుని చాట్ చేయాల్సి వస్తుంది.
  • అయితే ఇకపై ఆ అవసరం లేకుండా ఈ కస్టమ్​ లిస్ట్​ ద్వారా కాంటాక్ట్స్​ను ఫిల్టర్ చేసుకోవచ్చు.

అదేలాగంటే?:

  • ఇప్పటికే వాట్సప్‌ ఓపెన్‌ చేయగానే ఆల్‌, అన్‌రీడ్‌, ఫేవరెట్స్‌, గ్రూప్స్ ఇలా ఫిల్టర్లు కన్పిస్తాయి.
  • వీటి పక్కనే త్వరలో '+' ఐకాన్‌ రానుంది.
  • దీని సాయంతో మన కాంటాక్ట్స్​లో ఫ్యామిలీ, ఆఫీస్, ఫ్రెండ్స్.. ఇలా నచ్చిన కొత్త లిస్ట్​ క్రియేట్ చేసుకోవచ్చు.
  • అంతేకాక ఫిల్టర్‌ని లాంగ్‌ ప్రెస్‌ చేసి ఎడిట్‌ చేసే సదుపాయం కూడా ఉంది.
WhatsApp New Custom Lists Feature
WhatsApp New Custom Lists Feature (WhatsApp Blog)

అందుబాటులోకి ఎప్పుడు?: వాట్లాప్​లో ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్​బర్గ్​ తన వాట్సాప్​ ఛానల్​ ద్వారా స్వయంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్​ షాట్​ను కూడా పంచుకున్నారు. అందులో చాట్‌ ఫిల్టర్ల లిస్ట్‌ కనిపిస్తుంది. రోలవుట్‌ అవుతోన్న ఈ ఫీచర్‌ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.

మరో రెండు ఫీచర్లపై కసరత్తు: ఇదిలా ఉండగా వాట్సప్‌ మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అందులో చాట్ మెమరీ ఫీచర్ ఒకటి, రెండోది ఈజీ కాంటాక్ట్ మేనేజ్​మెంట్ చేసుకునే ఫీచర్. చాట్​ మెమరీ ఫీచర్​​ మెటా ఏఐతో షేర్​ చేసిన పర్సనల్ డేటాను రికార్డ్ చేసేందుకు ఉపయోగపడనుంది. ఆ తర్వాత మనకు అవసరమైనప్పుడు కావాల్సిన సమాచారం, సూచనలను ఇస్తుంది. ఇక కొత్త కాంటాక్ట్‌ను ప్రత్యేకంగా వాట్సప్‌లోనే సేవ్​ చేసుకునేందుకు మరో ఫీచర్​ను కూడా తీసుకురానుంది. అంటే ఇకపై మనం కాంటాక్ట్‌ సేవ్‌ చేసే సమయంలో కేవలం వాట్సప్‌లో యాడ్‌ చేయాలా? లేదా మొబైల్‌లోనూ యాడ్‌ చేయాలా? అనే రెండు ఆప్షన్లను కన్పించనున్నాయి. అందులో మనకు నచ్చిన ఆప్షన్​ను ఎంచుకుని కాంటాక్ట్​ను సేవ్​ చేసుకోవచ్చు. వీటిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఓపెన్ ఏఐ మరో సంచలనం- చాట్​జీపీటీలో అద్భుతమైన ఫీచర్..!

పవర్​ఫుల్ M4 సిరీస్​ చిప్​సెట్​తో యాపిల్ మ్యాక్​బుక్​ ప్రో- ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.