ETV Bharat / sports

US Open 2023 Winner Coco Gauff : 19 ఏళ్లకే తొలి గ్రాండ్​స్లామ్ టైటిల్.. యూఎస్​ ఓపెన్ ఛాంపియన్​గా కొకో గాఫ్ - యూఎస్‌ ఓపెన్‌ అల్కరాస్ సెమీస్ 2023

US Open 2023 Winner Coco Gauff : అమెరికా టెన్నిస్ సంచలనం కొకో గాఫ్..తన కెరీర్​లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ముద్దాడింది. యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో ఆమె అరీనా సబలెంకపై విజయం సాధించింది.

US Open 2023 Tennis
US Open 2023 Tennis
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 9:48 AM IST

Updated : Sep 10, 2023, 11:13 AM IST

US Open 2023 Winner Coco Gauff : యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో అమెరికాకు చెందిన కొకో గాఫ్ సంచలనం సృష్టించింది. సొంతగడ్డపై యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్‌లో రెండో సీడ్‌ అరీనా సబలెంకతో తలపడిన గాఫ్.. 2-6, 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. ఫలితంగా కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిన్న వయసులోనే యూఎస్​ ఓపెన్​ సింగిల్స్​ టైటిల్ గెలిచిన మూడో అమెరికన్​గా గాఫ్​ రికార్డులకెక్కింది. గాఫ్​ కంటే ముందు సెరెనా విలియమ్స్​ 1999లో ఈ ఫీట్ సాధించింది.

ఫైనల్ సాగిందిలా.. బెలారస్​కు చెందిన ప్లేయర్ సబలెంకతో.. గాఫ్ ఫైనల్​లో తలపడింది. ఈ పోటీలో తొలి రౌండ్​లో 2-6 తేడాతో గాఫ్ ఓడింది. అయితే తొలి రౌండ్​లో వెనుకబడ్డ గాఫ్.. రెండో రౌండ్​లో అద్భుతంగా పుంజుకుంది. తన పోరాట పటిమతో సబలెంక దూకుడుకు కళ్లెం వేసింది. దీంతో రెండో రౌండ్​ను 6-3తో గాఫ్ తన ఖాతాలో వేసుకుంది. రెండు రౌండ్లు ముగిసేసరికి చెరొక గేమ్ గెలిచారు. దీంతో విన్నర్ డిసైడర్ కోసం మూడో రౌండ్ ఆడాల్సి వచ్చింది.

ఇక మూడో రౌండ్​లో గాఫ్.. ఆత్మవిశ్వాసంతో ప్రత్యర్థిని ఎదుర్కొంది. ఈ రౌండ్​లో సబలెంక తప్పిదాలను గాఫ్.. తనకు అనుకూలంగా మార్చుకొని చెలరేగింది. ఈ రౌండ్​లో 6-2 తేడాతో సబలెంకను ఓడించి.. గాఫ్ టైటిల్ కొట్టేసింది. అంతేకాకుండా గత నాలుగేళ్లలో గాఫ్.. సబలెంకను ఏడాదికి ఓసారైనా ఓడిస్తూ వస్తోంది. ఈ విజయంతో గాఫ్.. వరుసగా 12 వ విక్టరీ నమోదు చేసింది. తాజా యూఎస్​ ఓపెన్​తో సహా.. గత 40 రోజుల్లో వాషింగ్టన్ ఓపెన్, సిన్సి​నటి ఓపెన్​ టైటిళ్లను సాధించింది.

US Open 2023 Alcaraz vs Medvedev : మరోవైపు పురుషుల సింగిల్స్‌లో.. ప్రపంచ నంబర్‌వన్ అల్కరాస్‌ సెమీస్​లో ఓడాడు. మూడో సీడ్‌ మెద్వెదవ్​తో తలపడిన అతడు.. 6-7, 1-6, 6-3, 3-6 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరో సెమీస్‌లో రెండో సీడ్‌ సెర్బియా ప్లేయర్ జకోవిచ్‌.. బెన్‌ షెల్టన్‌తో తలపడ్డాడు. ఈ పోటీలో 6-3, 6-2, 7-6 తేడాతో జకోవిచ్‌ గెలిచి ఫైనల్స్​లోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో యూఎస్‌ ఓపెన్‌లో అత్యధిక సార్లు (10) ఫైనల్స్​ చేరిన ఆటగాడిగా జకోవిచ్‌ రికార్డులకెక్కాడు.

మొదలెట్టిన మెద్వెదెవ్.. ముర్రే, సబలెంక శుభారంభం

వింబుల్డన్‌ కోటలో కొత్తరాజు.. జకోవిచ్‌పై సంచలన విజయం

Last Updated : Sep 10, 2023, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.