ETV Bharat / sports

German Open: క్వార్టర్స్​కు శ్రీకాంత్​.. సింధు, సైనా ఔట్​ - పీవీ సింధు

German Open: జర్మన్​ ఓపెన్​ సూపర్​ 300 బ్యాడ్మింటన్​ టోర్నమెంట్​లో దూసుకుపోతున్నాడు ప్రపంచ మాజీ నెం.1 కిదాంబి శ్రీకాంత్. గురువారం జరిగిన రెండో రౌండ్​లో గెలిచి క్వార్టర్స్​కు చేరుకున్నాడు. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్​ విభాగంలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు స్టార్​ ప్లేయర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్.

German Open
pv Sindhu
author img

By

Published : Mar 10, 2022, 6:46 PM IST

German Open: ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్​ తన జోరు కొనసాగిస్తున్నాడు. జర్మన్​ ఓపెన్​ సూపర్​ 300 టోర్నమెంట్​లో గురువారం క్వార్టర్​ఫైనల్​కు దూసుకెళ్లాడు. జర్ననీలో జరగుతున్న ఈ టోర్నీ నుంచి ఆదిలోనే నిష్క్రమించి నిరాశపరిచారు ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సైనా నెహ్వాల్.

ప్రపంచ మాజీ నెం.1గా ఉన్న శ్రీకాంత్.. చెనాకు చెందిన లు గువాంగ్​జుపై రెండో రౌండ్​లో 21-16, 21-23, 21-18 తేడాతో గెలుపొందాడు. అతడు తన తర్వాతి మ్యాచ్​లో డెన్మార్క్​కు చెందిన ఒలింపిక్ ఛాంపియన్​, టాప్​సీడ్​ విక్టర్​ అక్సెల్సెన్​తో తలపడే అవకాశం ఉంది.

ఇక మహిళల సింగిల్స్​ రెండో రౌండ్​లో ఏడో సీడ్​ సింధుకు షాక్​ ఇచ్చింది చైనాకు చెందిన ఝాంగ్​యి మాన్. 14-21 21-15 14-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. మరోవైపు ఫిట్​నెస్​ సమస్యలతో బాధపడుతున్న సైనా.. థాయ్​లాండ్​ క్రీడాకారిణి రచనాక్​ ఇంటనాన్ చేతిలో 10-21 15-21తేడాతో ఓడిపోయింది.

ఇదీ చూడండి: నా ఫైనల్​ టార్గెట్​ అదే: షట్లర్​ కిదాంబి శ్రీకాంత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.