ETV Bharat / sports

నిండు గర్భిణి అయినా.. 'ఒలింపియాడ్‌' బరిలోకి హారిక - Harika to play in Chess Olympiad

నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ.. సొంతగడ్డపై జరగనున్న చెస్‌ ఒలింపియాడ్‌లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో బరిలోకి దిగుతున్న భారత జట్లు బలంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడింది. ఇంకో రెండు రోజుల్లో చెన్నైలో ఒలింపియాడ్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ టోర్నీ, అందులో భారత్‌ అవకాశాలు, తన ఆటతీరుపై హారిక విశేషాలు తన మాటల్లోనే..

dronavalli harika
హారిక
author img

By

Published : Jul 26, 2022, 9:22 AM IST

చెస్‌ ఒలింపియాడ్‌ మాకు ఒలింపిక్స్‌తో సమానం. నేను నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నా. చెస్‌ ఒలింపియాడ్‌కు తొలిసారిగా భారత్‌ ఆతిథ్యమిస్తోంది. ప్రతిసారి జట్టుకు ఆడా. సొంతగడ్డపై ఆడకుంటే ఎలా అని అనిపించింది. పైగా టాప్‌ సీడ్‌గా ఉన్నాం. చెన్నైకి విమానంలో గంట ప్రయాణమే కాబట్టి ఇబ్బంది లేదు. రష్యాలో టోర్నీ జరుగుతుంటే వెళ్లడానికి అవకాశం ఉండేది కాదు. విమానంలో అనుమతి లభించకపోతే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలనుకున్నా. చాలా రోజులుగా ఇంట్లోనే ఉంటూ సాధన చేస్తున్నా. అన్ని గేమ్‌లూ కాకపోయినా వివిధ దశల్లో కొన్నైనా ఆడగలిగితే బాగుంటుందని అనుకుంటున్నా. ఒత్తిడి సంగతి ఇప్పుడే చెప్పలేను. చాలా నెలలుగా ఇంట్లోనే ఉంటున్నా. చెస్‌ సాధన చేయడమే తప్ప మరో పనైతే లేదు. మానసికంగా ఆటకు సిద్ధంగా ఉన్నా. చెస్‌ శారీరక క్రీడ కాదు. డాక్టర్‌ కూడా ఆడొచ్చని సలహా ఇచ్చారు. గతంలో 3, 4 నెలల గర్భిణులు కొందరు ఆడుండొచ్చు. ఎక్కువ నెలలతో ఆడుతున్న క్రీడాకారిణిని నేనే అనుకుంటా.

dronavalli harika
హారిక

పతకావకాశాలు పుష్కలం: కాగితం మీద చూస్తే భారత్‌ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. టాప్‌ సీడ్‌ కూడా. కానీ ఇది స్విస్‌ ఫార్మాట్‌. 11 రౌండ్ల టోర్నీ. ఒక్క రౌండ్‌ తేడా వచ్చినా ఓవరాల్‌ ఫలితంపై ప్రభావం ఉంటుంది. 2020, 2021లలో ఆన్‌లైన్‌లో ఒలింపియాడ్‌ జరిగింది. 2018లో చివరి సారిగా ప్రత్యక్షంగా ఆడాం. ఇప్పుడు మళ్లీ ఆడబోతున్నాం. ఎవరు ఎలాంటి ఫామ్‌లో ఉన్నారో తెలియదు. టోర్నీ ప్రారంభమయ్యే దాకా ఆ విషయం తెలియదు కూడా. కరోనా కాలంలో అన్నీ ఆన్‌లైన్‌లోనే టోర్నీలు జరిగాయి. ఫార్మాట్‌ కూడా భిన్నం. ఆన్‌లైన్‌లో జూనియర్‌ (బాలురు, బాలికలు), పురుషులు, మహిళలు కలిపి ఒకే జట్టుగా ఆడాం. 2020లో స్వర్ణం (రష్యాతో కలిసి), 2021 కాంస్య పతకాలు వచ్చాయి.

ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో ఆడనున్నాం. పురుషులు, మహిళలకు విడివిడిగా పోటీలు నిర్వహిస్తారు. అయిదుగురు క్రీడాకారిణుల్లో నలుగురు గేమ్‌లు ఆడతారు. ఒకరు రిజర్వ్‌గా ఉంటారు. టాప్‌ సీడ్‌గా బరిలో ఉన్నా.. పోటీ తప్పకపోవచ్చు. ఉక్రెయిన్‌, జార్జియా, కజకిస్తాన్‌, పోలెండ్‌ దేశాల నుంచి పోటీ ఉండొచ్చు. మరికొన్ని దేశాలు కూడా బాగానే ఆడుతున్నాయి. భారత పురుషుల జట్టు రెండో సీడ్‌గా బరిలో ఉంది. మహిళల జట్టు మాదిరే అది కూడా బాగానే ఉంది. కానీ ఆట మొదలయ్యాక ఎలా ఆడతారో అర్థమవుతుంది. కాకపోతే పురుషులు, మహిళలకు పతకాలు సాధించే అవకాశాలు సమానంగా ఉన్నాయి.

dronavalli harika
హారిక

చెస్‌ ఒలింపియాడ్‌లో ఒక దేశం నుంచి రెండు జట్లు (పురుషులు, మహిళలు) మాత్రమే పాల్గొనాలి. అయితే ఆతిథ్య దేశానికి మరో జట్టును బరిలో దింపే వెసులుబాటు ఉంది. అందుకే ఎ, బి జట్లను ఎంపిక చేశారు. టాప్‌-5లో ఉన్న క్రీడాకారులు ఎ- జట్టులో.. 5 నుంచి 10 స్థానాల్లో క్రీడాకారులు బి- జట్టులో ఉంటారు. పాల్గొంటున్న దేశాల సంఖ్య బేసి నంబరుగా ఉండటంతో సి- జట్లను కూడా ఎంపిక చేశారు. కాబట్టి భారత్‌ నుంచి 30 మంది క్రీడాకారులు బరిలో ఉన్నారు. చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ నుంచి ఇంత మంది క్రీడాకారులు ఆడుతుండటం ఇదే ప్రథమం. మన క్రీడాకారులు మంచి ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నా.

ఇదీ చదవండి: వందో వన్డేలో సెంచరీ వీరులు.. ఎవరెవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.