ETV Bharat / sports

Thaliand Open: సెమీస్​లో సింధు ఓటమి.. టోర్నీ నుంచి ఔట్ - థాయ్​లాండ్ ఓపెన్ 2022

Thaliand Open: థాయ్​లాండ్ ఓపెన్ సెమీస్​లో నిరాశపరిచింది స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ప్రపంచ నెం.4, చైనాకు చెందిన చెన్ యు ఫెయి చేతిలో వరుస సెట్లలో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది.

Thaliand Open
PV Sindhu news
author img

By

Published : May 21, 2022, 3:35 PM IST

Thaliand Open: థాయ్​లాండ్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. బ్యాంకాక్​ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన ఒలింపిక్​ ఛాంపియన్ చెన్ యు ఫెయి చేతిలో వరుస సెట్లలో ఓడిపోయింది. 43 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సింధు.. మూడో సీడ్​ చెన్​ చేతిలో 17-21, 16-21 తేడాతో ఓటమిపాలైంది.

చివరిసారిగా 2019 బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్​ టూర్ ఫైనల్స్​లో కూడా చెన్​ చేతిలో ఓడింది 26 ఏళ్ల సింధు. ఈ సీజన్​లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్​లో రెండు సూపర్ 300 టైటిల్స్​ గెలిచింది సింధు. తదుపరి జూన్ 7 నుంచి 12 వరకు జకార్తాలో జరిగే ఇండోనేషియా మాస్టర్స్​ 500లో పోటీపడనుంది.

ఇదీ చూడండి: భర్త ప్రోత్సాహం.. ఆమె పట్టుదల.. జాతీయ ఛాంపియన్​గా ఎదిగి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.