ETV Bharat / sports

షూటింగ్​ ప్రపంచకప్​లో భారత్​కు స్వర్ణం​

saurabh chaudhary win gold medal: అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్​ ఫెడరేషన్​ ప్రపంచకప్​లో భారత షూటర్​ సౌరభ్​ చౌదరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్​లో జర్మనీకి చెందిన మైకెల్​ స్క్వాల్డ్​పై 16-6 తేడాతో విజయం సాధించాడు.

author img

By

Published : Mar 1, 2022, 5:51 PM IST

saurabh chaudhary
సౌరభ్​ చౌదరి

saurabh chaudhary win gold medal: భారత షూటర్​ సౌరభ్​ చౌదరి తొలి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఈజిప్ట్​లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్​ ఫెడరేషన్​ ప్రపంచకప్​లో మంగళవారం భారత్​కు బంగారు పతకం అదించాడు. 19 ఏళ్ల సౌరభ్​ మెన్స్​ 10మీటర్ల పిస్టోల్ విభాగంలో జర్మనీకి చెందిన మైకెల్​ స్క్వాల్డ్​ పై 16-6 తేడాతో విజయం సాధించాడు. రష్యాకు చెందిన ఆర్టమ్​ చెర్నోసోవ్​ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 10మీటర్ల మెన్స్ విభాగంలో 584 పాయింట్లు సాధించి సెమీఫైనల్​కు అర్హత పొందిన సౌరభ్​ గ్రూప్​లో మెుదటి స్థానంలో నిలిచాడు.

మరో మ్యాచ్​లో భారత షూటర్​ శ్రేయ అగర్వాల్​ సెమీఫైనల్​ బెర్త్​ను తృటిలో కోల్పోయింది. సోమవారం జరిగిన 10మీటర్ల ఎయిర్ రైఫిల్​ ఈవెంట్లో 629.3 పాయింట్లు సాధించిన శ్రేయ 0.01 సెకన్ల తేడాతో ఓడిపోయింది. హంగేరీకి చెందిన ఎస్ట్జర్​ మెస్​జారోస్ సెమీఫైనల్​కు అర్హత సాధించింది.

ఈజిప్ట్​లో జరుగుతున్న ఈ ప్రపంచకప్​లో​ 10మీటర్ల ఎయిర్ రైఫిల్​, పిస్టోల్​ విభాగంలో కొత్త నిబంధనల అమలు చేశారు. దీని వల్ల ఆటగాళ్లు నేరుగా ఫైనల్స్​కు వెళ్లకుండా మొదటి ఎనిమిది షూటర్లు మాత్రమే సెమీస్​కు అర్హత సాధిస్తారు. వీరిలో నలుగురు ఒక్కో జట్టుగా విడిపోతారు. గ్రూపులో మొదట రెండు స్థానాలు సాధించిన వాళ్లు ఫైనల్లో ఆడతారు.

ఇదీ చదవండి: రోహిత్ శర్మ ట్విట్టర్​ అకౌంట్ హ్యాక్​! షాక్​లో ఫ్యాన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.