ETV Bharat / sports

గోపీచంద్​తో వివాదంపై పీవీ సింధు క్లారిటీ, అందుకే వచ్చేశానంటూ - సింధు కోచ్ గోపిచంద్​ వివాదం

PV Sindhu Gopichand Split తన కోచ్​ పుల్లెల గోపీచంద్​ అకాడమీ నుంచి వైదొలగడానికి గల కారణాన్ని తెలిపింది స్టార్ షట్లర్​ పీవీ సింధు. ఇంకా తన కెరీర్​లో జరిగిన సంఘటల్ని గుర్తుచేసుకుంది.

pv sindhu alitho saradaga
పీవీ సింధు ఆలీతో సరదాగా
author img

By

Published : Aug 23, 2022, 11:45 AM IST

Updated : Aug 23, 2022, 12:19 PM IST

గోపీచంద్​తో వివాదంపై పీవీ సింధు క్లారిటీ

PV Sindhu Gopichand Split: ఒలింపిక్స్​ ముందు వరకు కోచ్​ పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న స్టార్ బ్యాడ్మింటన్​ ప్లేయర్ పీవీ సింధు.. అనూహ్యంగా ఆ ప్రతిష్టాత్మక క్రీడల ముందు అకాడమీ నుంచి వైదొలిగింది. దీంతో వారిద్దరి మధ్య ఏమైనా వివాదం జరిగి ఉంటుందా అని పలు అనుమానాలు కలిగాయి. అయితే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సింధు ఈ విషయంపై మాట్లాడింది. గోపీచంద్​ అకాడమీలో కొన్ని విషయాలు తనకు నచ్చకపోవడం వల్లే బయటకు వచ్చేసినట్లు, అభిప్రాయభేదాలు వచ్చినట్లు చెప్పుకొచ్చింది.

"ఆయనతో కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేశాను. ఆ తర్వాత మా మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. కొన్ని విషయాలు నచ్చలేదు. నా ఆటపై ఎటువంటి ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో, ఆటపై మాత్రమే పూర్తి దృష్టి సారించాలని అకాడమీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అక్కడ కొన్ని విషయాలు కూడా నచ్చలేదు అలానే బయటకు వచ్చి నిరూపించాను. అక్కడ ఉన్నప్పుడు కూడా వివిధ కోచ్​లతో ఆడాను. ఓ ప్లేయర్​ ఆడేటప్పుడు ఎటువంటి వివాదాలు ఉండకూడదు. ఎందుకంటే ఆటపై ప్రభావం పడుతుంది. సరిగ్గా ఆడలేం. ఒలింపిక్స్​ అనేది ప్రతి ఆటగాడి కల. అలాంటప్పుడు నేను ఇలాంటి వాటిపై ఫోకస్​ పెడితే నా ఆట దెబ్బతినొచ్చు. అందుకే నాకు ఏది మంచో అని ఆలోచించి, అక్కడి నుంచి బయటకు వచ్చాను." అని పేర్కొంది.

బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందడానికి చిన్నప్పుడు సికింద్రాబాద్‌లోని మారేడ్​పల్లి నుంచి గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీ వరకు ప్రయాణం చేయాల్సి వచ్చేదని సింధు పేర్కొంది. ఆమెను తీసుకెళ్లి.. శిక్షణ ఇప్పించి తిరిగి తీసుకొచ్చే బాధ్యతను తండ్రి రమణే తీసుకున్నారని తెలిపింది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేసినట్లు గుర్తుచేసుకుంది. ​

"నా కెరీర్​ స్టార్ట్​ చేసినప్పుడు సికింద్రాబాద్​లో ఉండేవాళ్ళం. అప్పుడు రైల్వే గ్రౌండ్స్​కు వెళ్లి ఆడేవాళ్లం. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో ఆడేవాళ్లం. మా నాన్నే రెండు పూటలు తీసుకెళ్లేవారు. ఆ తర్వాత గచ్చిబౌలికి మారాం. అప్పట్లో చాలా కష్టాలు ఉండేవి. కానీ మా అమ్మ, నాన్న నా కోసం చాలా త్యాగాలు చేసి నన్ను ఈ స్థాయికి చేర్చారు. నా మొదటి గురువు, కోచ్​ మెహ​బూబ్​ అలీతో కెరీర్​ ప్రారంభించాను. ఆ తర్వాత ఆరిఫ్​, గోవర్దన్​, గోపీచంద్​. గోపీచంద్​తో కొన్నేళ్ల పాటు ప్రయాణం చేశాను. ఒక్కో కోచ్​ దగ్గర ఒక్కో స్కిల్ ఉంటుంది. అది నేను నేర్చుకున్నాను. ఇండోనేసియా నుంచి ఒకరు, కొరియో నుంచి కిమ్​ అనే లేడీ కోచ్​ దగ్గర కోచింగ్ తీసుకున్నాను. ప్రస్తుతం కొరియా కోచ్​ పార్క్ ట్రైనింగ్ ఇస్తున్నారు." ​

"ఇక అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా పోటీల్లో గెలుపొంది పతకం తీసుకున్న సమయంలో అక్కడ మన జాతీయ గీతాన్ని వినిపిస్తుంటారు. అది విన్నప్పుడు ఓ అద్భుతమైన ఫీలింగ్​. దాన్ని మాటల్లో చెప్పల్లేను. గూస్​బంప్స్​ వస్తాయి. కన్నీళ్లు వస్తాయి. మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామంటే మామూలు విషయం కాదు. మన దేశ పతాకం, జాతీయ గీతం విదేశాల్లోనూ వినిపించినప్పుడు గర్వంగా అనిపిస్తుంది. మన జాతీయ జెండా మరో దేశంలో రెపరెపలాడుతుంటే ఆ ఫీలింగ్​ను చెప్పలేం. ఇక ఆటగాళ్ల విషయానికొస్తే.. నా దృష్టిలో ప్రతి ప్లేయర్​తో ఆడటం సవాలే. ప్రతిరోజు మనది కాకపోవచ్చు. నా వంతుగా 100 శాతం ఉత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తుంటాను. మ్యాచ్​ స్టార్​ అవుతుందంటే కాస్త ఒత్తిడి కూడా ఉంటుంది" అని చెప్పింది.

ఇదీ చూడండి: సింధుకు ఆ వ్యక్తి బెదిరింపు లేఖ, కిడ్నాప్​ చేస్తానంటూ

Last Updated : Aug 23, 2022, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.