ETV Bharat / sports

మీరాబాయ్​ చానుకు గోల్డ్​ మెడల్.. గాయంతోనే 191 కేజీలు ఎత్తి! - 36 national games

స్టార్​ వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్​ చాను మరో ఘనతను అందుకుంది. 36వ జాతీయ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించింది.

meerabai chanu gold medal
మీరాబాయ్​ చానుకు గోల్డ్
author img

By

Published : Sep 30, 2022, 7:13 PM IST

ఒలింపిక్​ రజత పతక విజేత, రెండు సార్లు కామన్వెల్త్​ గేమ్స్ ఛాంపియన్​ మీరాబాయ్​ చాను మరో ఘనతను సాధించింది. 36వ నేషనల్​ గేమ్స్​ 2022లో 49కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. మొత్తంగా క్లీన్ అండ్ జెర్క్​లో(84+107) 191కేజీల బరువు ఎత్తి ఈ ఘనత సాధించింది. ఇదే క్రీడల్లో కామన్వెల్త్​ గోల్డ్ మెడలస్ట్​ సంజితా చను సిల్వర్​ మెడల్​ను దక్కించుకుంది. ఈమె క్లీన్ అండ్ జెర్క్​లో(82+105) 187 కేజీల బరువు ఎత్తింది.

అయితే ఈ ఘతన సాధించడంపై హర్షం వ్యక్తం చేసింది మీరాబాయ్​ చాను. తాను ఇటీవలే మణికట్టు గాయంతో బాధపడినట్లు చెప్పింది. "ఇటీవలే ఎన్​ఐఎస్​లో ట్రైనింగ్ చేసేటప్పుడు నా మణికట్టుకు గాయమైంది. అయితే గాయం తీవ్రత ఎక్కువ కాకుండా జాగ్రత్త పడ్డాను. డిసెంబరులో జరగబోయే ప్రపంచ ఛాంపియన్​షిప్స్ కోసం సన్నద్ధమవుతున్నా. జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ప్రారంభోత్సవ వేడుకల్లో నన్ను ప్రాతినిధ్యం వహించమని అడగడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్​లో పాల్గొనడం ఓ ఛాలెంజింగ్​గా తీసుకున్నాను" అని మీరాబాయ్​ పేర్కొంది.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా దిగ్గజంతో కలిసి గోల్ఫ్​ ఆడిన ధోనీ.. వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.