Malaysia Masters 2023 Final HS Prannoy : మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ అదరగొట్టాడు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండోనేసియా ప్లేయర్ క్రిస్టియన్ అడినటాను వెనక్కు నెట్టి ఫైనల్లో అడుపెట్టాడు. మొదటి గేమ్‌లో 19-17తో ప్రణయ్ లీడ్‌లో ఉండగా.. అడినటా గాయంతో వెనుదిరిగాడు. ఓ షాట్‌కు ప్రయత్నించే సమయంలో ఎగిరి.. ల్యాండ్ అవుతుండగా అడినటా ఎడమ మోకాలుకు గాయం అయింది. దీంతో తీవ్ర నొప్పితో బాధపడిన అడినటాను వీల్ ఛైర్లో కోర్టు బయటకు తీసుకెళ్లారు. ఇక ఫైనల్లో చైనీస్ తైపీ లేదా చైనాకు చెందిన షట్లర్ లిన్ చుయ్ను ప్రణయ్ ఎదుర్కొనున్నాడు. అయితే, పారిస్ ఒలంపిక్స్‌కు చేరుకునేందుకు ఈ మలేసియా మాస్టర్స్ టోర్నీయే మొదటి ఈవెంట్.
-
Prannoy HS reaches his first Malaysia Masters final‼️🥳🎉
— BAI Media (@BAI_Media) May 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
19-17* Adinata 🇮🇩 retires midway due to an injury
We wish him a speedy recovery 🙌
📸: @badmintonphoto#MalaysiaMasters2023#IndiaontheRise#Badminton pic.twitter.com/ShdkWFmSnt
">Prannoy HS reaches his first Malaysia Masters final‼️🥳🎉
— BAI Media (@BAI_Media) May 27, 2023
19-17* Adinata 🇮🇩 retires midway due to an injury
We wish him a speedy recovery 🙌
📸: @badmintonphoto#MalaysiaMasters2023#IndiaontheRise#Badminton pic.twitter.com/ShdkWFmSntPrannoy HS reaches his first Malaysia Masters final‼️🥳🎉
— BAI Media (@BAI_Media) May 27, 2023
19-17* Adinata 🇮🇩 retires midway due to an injury
We wish him a speedy recovery 🙌
📸: @badmintonphoto#MalaysiaMasters2023#IndiaontheRise#Badminton pic.twitter.com/ShdkWFmSnt
-
🇮🇳'n shuttler @PRANNOYHSPRI books a spot in the #MalaysiaMasters2023 Finals 🥳
— SAI Media (@Media_SAI) May 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
His opponent, Christian Adinanta of 🇮🇩 sustained an injury midway through the 1st Game and had to retire. pic.twitter.com/wNp6geLaOj
">🇮🇳'n shuttler @PRANNOYHSPRI books a spot in the #MalaysiaMasters2023 Finals 🥳
— SAI Media (@Media_SAI) May 27, 2023
His opponent, Christian Adinanta of 🇮🇩 sustained an injury midway through the 1st Game and had to retire. pic.twitter.com/wNp6geLaOj🇮🇳'n shuttler @PRANNOYHSPRI books a spot in the #MalaysiaMasters2023 Finals 🥳
— SAI Media (@Media_SAI) May 27, 2023
His opponent, Christian Adinanta of 🇮🇩 sustained an injury midway through the 1st Game and had to retire. pic.twitter.com/wNp6geLaOj
Malaysia Masters 2023 PV Sindhu : ఇకపోతే ఈ టోర్నీలో తన అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది ఒలింపిక్ పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. అయితే మహిళల సింగిల్స్‌లో భాగంగా శనివారం జరిగిన సెమీఫైన్లో సింధు 14-21, 17-21తో ఇండోనేసియాకు చెందిన జార్జియా మరిస్కా టున్ జుంగ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ కేవలం 44 నిమిషాల్లోనే ముగిసింది. ఈ టోర్నీ కంటే ముందు జరిగిన స్పెయిన్ టోర్నీలో కూడా సింధు కాస్తలో టైటిల్ మిస్ చేసుకుంది. ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గాయాల నుంచి కోలుకున్న సింధు ఇప్పటి వరకు ఒక్క కప్పు కూడా కొట్టలేదు. అయితే, ఈ మలేసియా మాస్టర్స్ ట్రోఫీ దాదాపు ఖాయం అనుకున్న దశలో సింధుకు నిరాశే మిగిలింది.
-
Tough day at the office, we bounce back stronger 💪 @pvsindhu1
— BAI Media (@BAI_Media) May 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📸: @badmintonphoto#MalaysiaMasters2023#IndiaontheRise#Badminton pic.twitter.com/EMRSfesPin
">Tough day at the office, we bounce back stronger 💪 @pvsindhu1
— BAI Media (@BAI_Media) May 27, 2023
📸: @badmintonphoto#MalaysiaMasters2023#IndiaontheRise#Badminton pic.twitter.com/EMRSfesPinTough day at the office, we bounce back stronger 💪 @pvsindhu1
— BAI Media (@BAI_Media) May 27, 2023
📸: @badmintonphoto#MalaysiaMasters2023#IndiaontheRise#Badminton pic.twitter.com/EMRSfesPin
PV Sindhu Injury : గతేడాది ఆగస్టులో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు గాయం అయింది. దాదాపు ఐదు నెలల పాటు ఇంట్లోనే ఉన్న సింధు.. ఈ ఏడాది జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్‌లో తిరిగి షటిల్ పట్టుకుంది. అయితే, ఈ టోర్నీతో పాటు ఇదే నెలలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లో కూడా ఓటమిపాలైంది. 2023 మార్చి ఆరంభంలో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ నుంచి మొదటి రౌండ్లోనే బయటకు వచ్చేసింది పీవీ సింధు. ఆ తర్వాత జరిగిన స్విస్ ఓపెన్ సూపర్ 300లో టైటిల్ చేజార్చుకుంది.
క్వార్టర్స్‌లో వెనుదిరిగిన కిదాంబి శ్రీకాంత్..
Malaysia Masters 2023 Kidambi Srikanth : వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు కూడా బ్రేక్ పడింది. శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్స్ పోరులో ఆదినాత్ చేతిలో 16-21, 21-16 21-11 ఓటమిపాలయ్యాడు. ప్రిక్వార్టర్స్ థాయ్‌లాండ్‌కు చెందిన వరల్డ్ నంబర్ 5 ర్యాంకర్ కున్లావుత్ వితిద్‌సర్న్‌పై సంచలన విజయాన్ని సాధించిన కిదాంబి.. అదే ఆటతీరును క్వార్టర్ ఫైనల్లో ప్రదర్శించలేకపోయాడు.