Indonesia open 2023 Badminton : భారత పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ద్వయం ఇప్పుడు మరో సంచలనం సృష్టించింది. ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో.. పురుషుల డబుల్స్ ఫైనల్లో విజేతగా నిలిచింది. ఈ తుది పోరులో ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ భారత ద్వయం మలేషియాకు చెందిన అరోన్ చియా-సో వూయ్ ఇక్ జోడీని 21-17, 21-18 తేడాతో ఓడించింది. ఫలితంగా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టైటిల్లో గెలిచిన తొలి భారత్ జోడీగా రికార్డుకెక్కింది.
satwik sairaj rankireddy and chirag shetty : అంతకుముందు ఈ ద్వయం సెమీస్‌లో 17-21, 21-19, 21-18 తేడాతో సౌత్ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె జోడీని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫలితంగా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 1000 ఈవెంట్లో ఫైనల్‌కు చేరిన మొదటి భారత జోడీగా రికార్డు సృష్టించింది. క్వార్టర్స్‌లో 21-13, 21-13 తేడాతో టాప్ సీడ్ ఫజర్ అల్ఫియాన్- మహమ్మద్ రియాన్ (ఇండోనేసియా)పై విజయాన్ని అందుకుంది. మంచి స్మాష్‌లు, డ్రాప్‌లు, క్రాస్‌కోర్టు షాట్లతో విజృంభించిన ఈ ద్వయం 41 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఇక ఈ సీజన్‌లో ఈ జోడీ.. స్విస్ ఓపెన్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గెలుపొంది గోల్డ్ మెడల్స్‌ను ముద్దాడగా.. మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ చేరింది.
-
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🥇
— BAI Media (@BAI_Media) June 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Proud of you boys 🫶
📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#BWFWorldTour #IndiaontheRise#Badminton pic.twitter.com/dbcWJstfVk
">𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🥇
— BAI Media (@BAI_Media) June 18, 2023
Proud of you boys 🫶
📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#BWFWorldTour #IndiaontheRise#Badminton pic.twitter.com/dbcWJstfVk𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🥇
— BAI Media (@BAI_Media) June 18, 2023
Proud of you boys 🫶
📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#BWFWorldTour #IndiaontheRise#Badminton pic.twitter.com/dbcWJstfVk
HS prannoy indonesia open : ప్రణయ్ ఓటమి.. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో మూడో సీడ్ కొడాయ్ నరోకా (జపాన్)ను 21-18, 21-16 తేడాతో ఓడించి సెమీస్‌కు అర్హత సాధించిన హెచ్ ఎస్ ప్రణయ్.. సెమీస్‌లో నిరాశ ఎదురైంది. డెన్మార్క్‌కు చెందిన విక్టర్ యాక్సల్సెన్పై పరాజయాన్ని అందుకున్నాడు. 15-21 15-21 తేడాతో ఇంటి ముఖం పట్టాడు.
Sindhu indonesia open : శ్రీకాంత్, సింధు కూడా.. భారత స్టార్ షట్లర్స్ కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు కూడా టోర్నీ మొదట్లోనే వెనుదిరిగారు. మహిళల సింగిల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పీవీ సింధు రెండో రౌండ్లోనే వెనుదిరగగా... శ్రీకాంత్ క్వార్టర్స్‌లో నిష్క్రమించాడు.
ఇదీ చూడండి :
PV Sindhu Indonesia Open : ఇండోనేసియా ఓపెన్‌లో సింధు, ప్రణయ్ శుభారంభం.. తొలి రౌండ్లో విజయం
సాత్విక్- చిరాగ్ అదరహో.. 52 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆసియా బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్