ETV Bharat / sports

ఆఖరి గోల్‌ నీదా.. నాదా! అర్జెంటీనా-ఫ్రాన్స్‌ మధ్య పోరు హోరాహోరీ​ - ఫిపా ఫైనల్​ అర్జెంటీనా ఫ్రాన్స్‌ 2022

చిన్న జట్ల సంచలనాలు.. పెద్ద జట్ల పతనం.. స్టార్‌ ఆటగాళ్ల మెరుపులు.. యువ కెరటాల అద్భుతాలు.. అన్నీ చూశాం! అనిర్వచనీయ అనుభూతులతో ఉర్రూతలూగిపోయాం. ఇక ఆఖరి ఘట్టం కూడా అంచనాలకు తగ్గట్లు అద్భుతంగా సాగిపోతే 2022 టోర్నీ ఫుట్‌బాల్‌ ప్రేమికుల జ్ఞాపకాల్లో పదిలం! మరి 'మూడో' ముచ్చట తీర్చుకునే జట్టేది? 26 ఏళ్ల నిరీక్షణకు అర్జెంటీనా తెరదించుతుందా.. లేక వరుసగా రెండో కప్పును ఫ్రాన్స్‌ ఎగరేసుకుపోతుందా? కప్పు కలను నెరవేర్చుకుని మెస్సి సగర్వంగా నిష్క్రమిస్తాడా? ఎంబాపె ఖాతాలో మరో టైటిల్‌ చేరుతుందా?

fifa world cup final 2022
ఫిపా ఫైనల్​ అర్జెంటీనా ఫ్రాన్స్‌ 2022
author img

By

Published : Dec 18, 2022, 7:25 AM IST

ప్రపంచ ఫుట్‌బాల్‌ ప్రేమికులందరినీ మునివేళ్లపై నిలబెట్టే సమరానికి రంగం సిద్ధమైంది. దాదాపు రెండొందల దేశాలు తలపడే అర్హత టోర్నీ అనే రెండేళ్ల క్రతువును పూర్తి చేసుకుని.. 32 జట్లు పోటీ పడే అసలు టోర్నీలోకి అడుగు పెట్టి.. నెల రోజుల హోరాహోరీ సమరాలు, ఉత్కంఠభరిత పోరాటాల అనంతరం.. కప్పు కోసం బరిలో మిగిలిన రెండు జట్ల మధ్య అంతిమ యుద్ధం ఆదివారమే. తొలి మ్యాచ్‌లో దిమ్మదిరిగే షాక్‌ తిని, నిష్క్రమణ కత్తి వేలాడుతుండగా, ఉత్కంఠభరిత క్షణాలను అధిగమిస్తూ, ఒక్కో అడ్డంకిని దాటుతూ ఫైనల్‌ చేరిన అర్జెంటీనా.. నాకౌట్‌ బెర్తు ఖరారు చేసుకున్నాక గ్రూప్‌ దశలో ట్యునీసియా చేతిలో అనూహ్య ఓటమి ఎదురైనా.. ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ ఫైనల్లో అడుగు పెట్టిన ఫ్రాన్స్‌ 2022 ఫిఫా ప్రపంచకప్‌ కోసం కొట్లాడబోతున్నాయి. ఫామ్‌ పరంగా చూసినా, నైపుణ్యాల విషయంలో రెండు జట్లలో దేనికి ఏదీ తీసిపోయేది కాకపోవడంతో ఫుట్‌బాల్‌ పండితులు కూడా ఫేవరెట్‌ ఎవరో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి తుది సమరంలో హోరాహోరీ, అత్యుత్తమ వినోదం గ్యారెంటీ.

ప్రపంచం మెచ్చిన బ్రెజిల్‌ కథ క్వార్టర్స్‌లో ముగిసిపోయింది. నాలుగుసార్లు ఛాంపియన్‌ జర్మనీ గ్రూప్‌ దశ అయినా దాటలేకపోయింది. మాజీ ఛాంపియన్లు స్పెయిన్‌, ఇంగ్లాండ్‌ నాకౌట్లో ఒకదాని తర్వాత ఒకటి వెనుదిరిగాయి. మొరాకో సంచలనాలకు, క్రొయేషియా అద్భుతాలకు సెమీస్‌లో బ్రేక్‌ పడింది.

ఇక మిగిలింది అర్జెంటీనా, ఫ్రాన్స్‌!
అర్జెంటీనా గెలిచిన ప్రపంచకప్‌లు రెండు. ఫ్రాన్స్‌ విజేతగా నిలిచిందీ రెండుసార్లే! ఈసారి రెండు జట్లూ గ్రూప్‌ దశలో ఒక్కో మ్యాచ్‌ ఓడి ఫైనల్‌ చేరాయి. అర్జెంటీనా సూపర్‌ స్టార్‌ మెస్సి ఈ ప్రపంచకప్‌లో సాధించిన గోల్స్‌ అయిదు. ఫ్రాన్స్‌ యోధుడు ఎంబాపె కొట్టిన గోల్స్‌ కూడా అయిదే! ఇటు చూస్తే ఆల్‌టైం గ్రేట్‌ మెస్సికి తోడు అల్వారెజ్‌, మార్టినెజ్‌.. అటు చూస్తే యువ సంచలనం ఎంబాపెతో పాటు గ్రీజ్‌మన్‌, గిరూడ్‌! ఇంకా చెప్పాలా ఇది సమవుజ్జీల సమరమని!

మనోళ్ల ఓటు అర్జెంటీనాకే!
భారత జట్టు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఆడడం కలే కానీ.. ఈ మెగా టోర్నీ జరుగుతుంటే మనవాళ్లు గెలవాలని కోరుకునే జట్లు తప్పక ఉంటాయి. ఎప్పట్నుంచో భారతీయుల ఫేవరెట్‌ బ్రెజిలే. అది కప్పు రేసులో నుంచి వెళ్లిపోగానే అర్జెంటీనా పైకి తమ ఆశలను మళ్లిస్తారు. మెస్సికి ఇక్కడ కోట్లల్లో అభిమానులన్నారు. వాళ్లందరి కోరికా అర్జెటీనా గెలవాలనే. ఐరోపా జట్ల కంటే దక్షిణ అమెరికా జట్ల మీదే మనవాళ్లకు గురి ఎక్కువ. కాబట్టి ఫ్రాన్స్‌ కాకుండా అర్జెంటీనా కప్పు గెలవాలన్నది భారత అభిమానుల కోరిక.

ఫ్రాన్స్‌కు ఫ్లూ దెబ్బ
ప్రపంచకప్‌ ఫైనల్‌ ముంగిట ఫ్రాన్స్‌ జట్టులో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఆ జట్టు శిబిరంలో ఫ్లూ విస్తరిస్తుండడంతో ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే డయోట్‌, రాబియట్‌ మొరాకోతో సెమీస్‌కు దూరమయ్యారు. అయినా జట్టు సులువుగానే గెలిచేసింది. కానీ అర్జెంటీనాతో ఫైనల్‌ ముంగిట వరానె లాంటి కీలక ఆటగాడితో పాటు కొనాటె కూడా ఫ్లూ బారిన పడ్డాడు. వాళ్లిద్దరూ జలుబు, కాస్త జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. వరానె ఫైనల్‌కు అందుబాటులో లేకుండా ఫ్రాన్స్‌కు ఎదురుదెబ్బే.

పంచకప్‌ విజేతకు రూ.347 కోట్లు
ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ విజేతకు రూ.347 కోట్లు ప్రైజ్‌మనీగా లభించనుంది! రన్నరప్‌కు రూ.248 కోట్లు బహుమతిగా దక్కుతాయి. మూడో స్థానం దక్కించుకున్న క్రొయేషియా రూ. 223 కోట్లు.. నాలుగు స్థానంలో నిలిచిన మొరాకో రూ.206 కోట్లు అందుకుంటాయి. క్వార్టర్‌ఫైనల్లో ఓడిన బ్రెజిల్‌, నెదర్లాండ్స్‌, పోర్చుగల్‌, ఇంగ్లాండ్‌ రూ.140 కోట్ల చొప్పున.. ప్రిక్వార్టర్స్‌లో ఇంటిముఖం పట్టిన అమెరికా, సెనెగల్‌, ఆస్ట్రేలియా, పోలెండ్‌, స్పెయిన్‌, జపాన్‌, స్విట్జర్లాండ్‌, దక్షిణకొరియాలకు రూ.107 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది.

అలా కానీ ముగిస్తే..
మెస్సి.. మెస్సి.. మెస్సి..కొన్ని రోజులుగా ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నది ఈ దిగ్గజ ఆటగాడి గురించే. అంతర్జాతీయంగానే కాక క్లబ్‌ ఫుట్‌బాల్‌లోనూ ఎన్నో అసాధారణ ఘనతలు అందుకుని ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించిన మెస్సికి ప్రపంచకప్‌ మాత్రం కలగానే మిగిలిపోయింది. తమ దేశ దిగ్గజం మారడోనాలా, బ్రెజిల్‌ ఆల్‌టైం గ్రేట్‌ పీలేలా ప్రపంచకప్‌ అనే కలికితురాయిని తన కీర్తి కిరీటంలో చేర్చుకుని సగర్వంగా నిష్క్రమించాలన్నది అతడి కోరిక.

2014లోనే అవకాశం వచ్చినా, ఫైనల్లో అర్జెంటీనా బోల్తా కొట్టడంతో అతడి కల నెరవేరలేదు. మళ్లీ ఇప్పుడు అతడికి అరుదైన అవకాశం వచ్చింది. ఈ టోర్నీలో తన అద్భుత విన్యాసాలతో అర్జెంటీనా ఫైనల్‌ చేరిన మెస్సి.. ఫైనల్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేసి తన అంతర్జాతీయ కెరీర్‌కు ఘనమైన ముగింపునిస్తాడని, ఒక పరిపూర్ణత్వాన్ని అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఫైనల్లో మెస్సి గోల్‌ కొట్టి, అర్జెంటీనా కప్పు గెలిస్తే ఫుట్‌బాల్‌ ప్రపంచం ఆనంద తాండవం చేస్తుందనడంలో సందేహం లేదు.

  • అర్జెంటీనా, ఫ్రాన్స్‌ జట్లలో ఏది ఫైనల్లో నెగ్గినా వారికి మూడో ప్రపంచకప్‌ అవుతుంది. అర్జెంటీనా 1978, 1986లో విజేతగా నిలవగా.. ఫ్రాన్స్‌ 1998, 2018లో ఛాంపియన్‌ అయింది.
  • అర్జెంటీనా దక్షిణ అమెరికా జట్టు కాగా.. ఫ్రాన్స్‌ ఐరోపాకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ రెండు ఖండాల జట్ల మధ్య జరిగిన పది ఫైనల్స్‌లో ఏడుసార్లు దక్షిణ అమెరికా జట్టుదే విజయం.
  • 1998లో ప్రపంచకప్‌ గెలిచిన ఫ్రాన్స్‌ జట్టులో సభ్యుడైన డిడ్లియర్‌ డెస్‌ఛాంప్స్‌.. 2018లో ఆ జట్టు కోచ్‌గా ప్రపంచకప్‌ సాధించాడు. ఈసారి కూడా అతను ఫ్రాన్స్‌ను విజేతగా నిలిపితే.. ఇటలీ కోచ్‌ విటోరియా పొజో (1934, 1938) తర్వాత రెండు ప్రపంచకప్‌లు సాధించిన కోచ్‌గా రికార్డులకెక్కుతాడు.
  • 19 ఏళ్ల వయసులో 2018 ప్రపంచకప్‌ ఫైనల్లో గోల్‌ కొట్టి ఫ్రాన్స్‌ను గెలిపించిన ఎంబాపె.. బ్రెజిల్‌ దిగ్గజం పీలే (1958-17 ఏళ్లు) తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్లో స్కోర్‌ చేసిన అతి పిన్నవయస్కుడు అయ్యాడు. ఈసారి ఫ్రాన్స్‌ నెగ్గితే.. తన తొలి రెండు ప్రపంచకప్‌ల్లో టైటిల్‌ సాధించిన పీలే (1958, 1964) రికార్డును ఎంబాపె సమం చేస్తాడు.

ప్రపంచకప్‌లో..అర్జెంటీనా విజయాలు - 47

  • డ్రాలు - 16
  • ఓటములు - 24
  • ఫ్రాన్స్‌
  • విజయాలు - 39
  • డ్రాలు - 13
  • ఓటములు - 20

అర్జెంటీనా ఫైనల్‌కు ఇలా.. ఫ్రాన్స్‌

1-2 (సౌదీ) మ్యాచ్‌ 1 4-1 (ఆస్ట్రేలియా)

2-0 (మెక్సికో) మ్యాచ్‌ 2 2-1 (డెన్మార్క్‌)

2-0 (పోలెండ్‌) మ్యాచ్‌ 3 0-1 (ట్యునీషియా)

2-1 (ఆస్ట్రేలియా) ప్రిక్వార్టర్స్‌ 3-1 (పోలెండ్‌)

2-2(4-3) (డచ్‌) క్వార్టర్స్‌ 2-1 (ఇంగ్లాండ్‌)

3-0 (క్రొయేషియా) సెమీస్‌ 2-0 (మొరాకో)

ఇదీ చదవండి: 'గోల్డెన్‌ బూట్' కోసం మెస్సీ, ఎంబాపె ఫైట్​.. ఆ అవార్డులు ఎవరికో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.