ETV Bharat / sports

బాక్సింగ్ ప్రపంచకప్​: భారత్​ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు - బాక్సర్లు సిమ్రన్​​జీత్​ కౌర్​, మనీషాలకు స్వర్ణం

ప్రపంచకప్​ బాక్సింగ్​లో భాగంగా భారత్​ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు వచ్చి చేరాయి. టోర్నీలో ఇప్పటికే అమిత్​ పంగాల్​ పసిడి పతకం సాధించగా.. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్స్​లో సిమ్రన్​జీత్​ కౌర్​, మనీషా వారివారి విభాగాల్లో విజేతలుగా నిలిచారు.

Boxers Simranjeet Kaur, Manisha strike gold in Boxing Worldcup
బాక్సింగ్ ప్రపంచకప్​: భారత్​ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు
author img

By

Published : Dec 21, 2020, 7:03 AM IST

బాక్సింగ్‌ ప్రపంచకప్‌లో మరో రెండు స్వర్ణాలు భారత్‌ ఖాతాలో చేరాయి. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం సిమ్రన్‌జీత్‌కౌర్‌ (60 కేజీ), మనీషా (57 కేజీ) పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. సిమ్రన్‌జీత్‌ 4-1తో మయా క్లిన్‌హన్స్‌ (జర్మనీ)పై గెలవగా.. మనీషా 3-2తో మన దేశానికే చెందిన సాక్షిపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో అమిత్‌ పంగాల్‌ (52 కేజీ) కూడా పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.

ఈ టోర్నీలో సతీశ్​ కుమార్‌ (91 కేజీ పైన), సాక్షి (57 కేజీ) రజతం నెగ్గగా.. సోనియా లాథర్‌ (57 కేజీ), పూజా రాణి (75 కేజీ), గౌరవ్‌ సోలంకీ (57 కేజీ), మహ్మద్‌ హుసాముద్దీన్‌ (57 కేజీ) కాంస్య పతకాలు సాధించారు. దీంతో మొత్తం మీద మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో భారత్‌.. రెండో స్థానంతో టోర్నీని ముగించింది. ఈ పోటీల్లో భారత్‌తో పాటు జర్మనీ, బెల్జియం, క్రొయేషియా, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, మల్దోవా, నెదర్లాండ్స్‌, పోలెండ్‌, ఉక్రెయిన్‌ పాల్గొన్నాయి.

ఇదీ చూడండి: ఉత్కంఠగా క్రికెట్ మ్యాచ్​.. ఆకాశంలో అద్భుతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.