ETV Bharat / sports

ఫ్రెంచ్​​ ఓపెన్​లో భారత్​కు నిరాశే.. సెమీస్​లో బోపన్న జోడీ ఓటమి - టెన్నిస్​ అప్​డేట్స్​

French open 2022: ఫ్రెంచ్​ ఓపెన్​ సెమీఫైనల్స్​లో బోపన్న-మిడ్డెల్​కూప్​ జోడీ పరాజయం పొందింది. మెన్స్​ డబుల్స్​ విభాగంలో తొలి సెట్​లో రాణించిన ఈ జోడీ.. ఆ తర్వాత సెట్లలో తడబడింది. దీంతో వీరిపై ప్రత్యర్థి రోజర్​-అరేవాలో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు.

బోపన్న
బోపన్న
author img

By

Published : Jun 2, 2022, 7:13 PM IST

French open 2022: ఫ్రెంచ్​ ఓపెన్​లో భారత్​కు నిరాశే ఎదురైంది. మెన్స్​ ​డబుల్స్​ విభాగంలో నెదర్​లాండ్స్​ ఆటగాడు మిడ్డెల్​కూప్​తో కలిసి సెమీఫైనల్​ దాకా దూసుకెళ్లిన స్టార్​ టెన్నిస్​ ఆటగాడు రోహాన్​ బోపన్న.. సెమీస్​లో ఓటమిని ఎదుర్కొన్నాడు. డచ్​కు చెందిన జే రోజర్​.. సాల్వడార్​కు చెందిన ఎం.అరేవాలోతో తలపడిన బోపన్న-మిడ్డెల్​కూప్​ జోడీ తొలి సెట్​లో శుభారంభం చేసినా తర్వాత రెండు సెట్లలో తడబడింది. దీంతో ఈ జోడీకి ఫైనల్స్​కు చేరే అవకాశం చేజారిపోయింది.

తొలి సెట్​లో ప్రత్యర్థిపై 6-4 తేడాతో బోపన్న-మిడ్డెల్​కూప్​ జోడీ విజయం సాధించింది. ఆ తర్వాత సెట్లో పుంజుకున్న రోజర్​-అరేవాలో జోడీ రెండో సెట్లో 3-6తో మూడో సెట్లో 6-7తో ప్రత్యర్థిని ఓడించింది. ఆటముగిసే సమయానికి బోపన్న-మిడ్డెల్​కూప్​లకు 8, రోజర్-అరేవాలోకు 10 టై బ్రేక్​ పాయింట్లు దక్కాయి. బోపన్న-మిడ్డెల్​కూప్​ జోడీపై విజయం సాధించిన రోజర్​-అరేవాలోలు ఫైనల్​కు అడుగుపెట్టారు.

ఇదీ చూడండి : వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భారత స్టార్​ క్రికెటర్.. ఫొటోలు వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.