ETV Bharat / sports

Asian Games 2023 India Gold Medal : భారత్​ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు.. భారత 'బాహుబలి' అదరగొట్టేశాడు భయ్యా

Asian Games 2023 India Gold Medal : ఆసియా గేమ్స్​ 2023లో భారత్​కు మరో గోల్డ్​ మెడల్స్​ వరించాయి. దీంతో భారత గోల్డ్​ మెడళ్ల సంఖ్య 13కు చేరింది. ఆ వివరాలు..

Avinash Sable 3000m Steeplechase Gold
Avinash Sable 3000m Steeplechase Gold
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 5:32 PM IST

Updated : Oct 1, 2023, 8:52 PM IST

Asian Games 2023 India Gold Medal : చైనాలోని హాంగ్​జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల జోరు కొనసాగిస్తోంది. తాజాగా మరో రెండు గోల్డ్​ మెడల్స్​​ భారత్ ఖాతాలోకి వచ్చి చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌, షాట్‌ఫుట్‌ విభాగాల్లో గోల్డ్ మెడల్స్​ వచ్చాయి. 3000 మీటర్ల స్టీపుల్​చేజ్​లో భారత క్రీడాకారుడు అవినాశ్ సాబ్లే స్వర్ణం సాధించాడు. దీంతో ఆసియా క్రీడల్లో 3000 స్టీపుల్​చేజ్​లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగా అవినాశ్​ సాబ్లే​ చరిత్ర లిఖించాడు. ఇక షాట్‌పుట్‌లో భారత 'బాహుబలి' తేజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ స్వర్ణాన్ని ముద్దాడాడు. అందరి కన్నా ఎక్కువగా 20.36 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. దీంతో భారత్ ఇప్పటివరకు సాధించిన మొత్తం గోల్డ్​ మెడళ్ల సంఖ్య 13కు చేరింది.

Asian Games 2023 Nikhat Zareen : మరోవైపు ప్రముఖ భారత బాక్సర్​ నిఖత్​ జరీన్(తెలంగాణా అమ్మాయి)​ ఈ ఆసియా క్రీడల్లో నిరాశ ఎదురైంది. మహిళల 50 కేజీల విభాగంలో సెమీ ఫైనల్​ మ్యాచ్​లో ఓడిపోయింది. ప్రత్యర్థి రక్​సత్​తో తలపడిన జరీన్.. ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మరోవైపు పురుషుల 50 మీటర్ల ట్రాప్‌ ఈవెంట్‌లో భారత్‌ బ్రాండ్ మెడల్​ను దక్కించుకుంది. దీంతో షూటింగ్‌ విభాగంలో ఈ సారి పతకాల సంఖ్య 22కి చేరింది.

అలాగే మహిళల 1500 మీ. ఫైనల్‌లో హర్మిలన్‌ రజతంతో మెరిసింది. పురుషుల 1500 మీ. ఫైనల్‌లో అజయ్‌ రజతం, జిన్సన్‌ జాన్సన్‌ కాంస్యంతో సత్తా చాటారు. మెన్స్ లాంగ్ జంప్​లో మురళి శ్రీశంకర్​ సిల్వర్​ మెడల్​ను ముద్దాడాడు. ఉమెన్​ Heptathlon 800 మీటర్ల విభాగంలో నందిని బ్రాండ్​ మెడల్​ను అందుకుంది. ఉమెన్స్ డిస్కస్​ థ్రో పైనల్​లో సీమా పునియాకు కాంస్య పతకం దక్కింది. ఇప్పటివరకూ 13 గోల్డ్ మెడల్స్​, 19 సిల్వర్ మెడల్స్​, 19 బ్రాండ్ మెడల్స్​తో కలిపి మొత్తం 51 పతకాలను ఖాతాలో వేసుకుంది భారత్​. దీంతో ప్రస్తుతం ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Jyothi Yarraji Asian Games 2023 : హై డ్రామా.. ఎట్టకేలకు సిల్వర్ మెడల్​తో మెరిసిన తెలుగు తేజం

Last Updated : Oct 1, 2023, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.