ETV Bharat / sports

భారత యువ గ్రాండ్​మాస్టర్​కు షాక్​.. నాకౌట్​ చేరకుండానే.. - కార్ల్​సన్​

Airthings Masters: భారత గ్రాండ్​మాస్టర్​ ప్రజ్ఞానందకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌లో ప్రపంచ నెం.1 చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన అతడు నాకౌట్​ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

Praggnanandhaa
chess
author img

By

Published : Feb 23, 2022, 12:54 PM IST

Airthings Masters: భారత యువ గ్రాండ్​మాస్టర్​ ప్రజ్ఞానందకు షాక్​! ఎయిర్​థింగ్స్​ మాస్టర్స్​లో ప్రపంచ ఛాంపియన్​ కార్ల్​సన్​ను ఓడించి సంచలనం సృష్టించిన అతడు.. నాకౌట్​ చేరకుండానే వెనుదిరిగాడు. ఈ ఆన్​లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్​ను 11వ స్థానంతో ముగించాడు ప్రజ్ఞానంద.

ఈ పోటీల్లో టాప్‌ ఎనిమిది స్థానాల్లో నిలిచిన ప్లేయర్లే తర్వాత జరిగే నాకౌట్‌ దశకు చేరుకుంటారు. దీంతో నాకౌట్​కు అర్హత కోల్పోయాడు ప్రజ్ఞానంద.

అంతకుముందు.. కార్ల్‌సన్‌ను ఓడించిన అనంతరం​ మరో రెండు రౌండ్లలో విజయం సాధించాడు ప్రజ్ఞానంద. మంగళవారం జరిగిన పోటీల్లో ఈ 16 ఏళ్ల కుర్రాడు రష్యా ఆటగాడు నాడిర్‌బెక్‌ అబ్దుసట్టారావ్‌తో డ్రా చేసుకోగా.. 10, 12 రౌండ్లలో అండ్రీ ఎసిపెంకో, అలెగ్జాండ్రా కోస్టిన్యూక్‌లను ఓడించాడు.

ఇదీ చూడండి: Praggnanandhaa: 'ఎంజాయ్ చేస్తూ ప్రపంచ విజేతను ఓడించాను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.