టోక్యో వేదికగా 2021లో జరగనున్న ఒలింపిక్స్ హాకీ పోటీల షెడ్యూల్ ఖరారైంది. జులై 24న ఆరంభమయ్యే క్రీడల పండగ ఆరంభమ్యాచ్‌లో.. భారత పురుషుల జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. పూల్-ఎలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, స్పెయిన్, జపాన్, న్యూజిలాండ్‌తో కలిసి మన్‌ప్రీత్‌సింగ్ బృందం ఆడనుంది. భారత్.. జులై 25న ఆస్ట్రేలియాతో, జులై 27న స్పెయిన్‌తో, జులై 29న ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాతో, 30న జపాన్‌తో తలపడనుంది.
ఆగస్టు 1, 3, 5న వరుసగా పురుషుల క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
మహిళలు ఇలా..
మరోవైపు పూల్-ఎలో ఉన్న భారత మహిళల జట్టు నెదర్లాండ్తో మ్యాచ్‌తో పోరును ప్రారంభించనుంది. ఈ పూల్‌లో జర్మనీ, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా ఉండగా, పూల్-బిలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, స్పెయిన్, చైనా, జపాన్ ఆడనున్నాయి. నెదర్లాండ్స్‌తో ఆరంభ మ్యాచ్ తర్వాత జర్మనీ (జులై 26), గ్రేట్ బ్రిటన్ (జులై 28), అర్జెంటీనా (జులై 29), జపాన్ (జులై 30)తో రాణీ రాంపాల్ సేన తలపడనుంది.