ETV Bharat / sports

Asian Champions Trophy: పాక్​ను చిత్తుచేసిన భారత జట్టు - Asian Champions Trophy latest news

Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో పాకిస్థాన్​పై భారత్‌ విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై 3-1 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఈ విజయంతో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.

Asian Champions Trophy
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ
author img

By

Published : Dec 17, 2021, 5:26 PM IST

Asian Champions Trophy: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్‌ జయభేరి మోగించింది. 3-1 గోల్స్‌ తేడాతో పాక్‌ను ఓడించింది.

2018లో మస్కట్‌ వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ వర్షం కారణంగా రద్దవడం వల్ల భారత్‌-పాక్‌ జట్లు ట్రోఫీని పంచుకున్నాయి. ఈసారి డిఫెండింగ్‌ ఛాంపియన్ల హోదాలో బరిలో దిగాయి. టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రక కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు ఆడుతున్న తొలి టోర్నీ ఇదే.

కొరియాతో తొలి మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకున్న భారత్‌... రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 9-0 గోల్స్‌ తేడాతో చిత్తు చేసింది. మూడో మ్యాచ్‌లో 3-1 గోల్స్‌ తేడాతో పాక్‌ను ఓడించింది. తద్వారా ఐదు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.

ఇదీ చూడండి: మరో టోర్నీలో సింధు ఓటమి.. శ్రీకాంత్​కు పతకం ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.