ETV Bharat / sports

వచ్చే ఏడాదికి మహిళల ప్రపంచకప్​ వాయిదా

author img

By

Published : May 12, 2020, 5:32 PM IST

ఈ ఏడాది నవంబర్​లో జరగాల్సిన అండర్​-17 మహిళల ఫిఫా ప్రపంచకప్​ను వాయిదా వేస్తూ ఇప్పటికే ఓ అధికార ప్రకటన వెలువడింది. తాజాగా ఆ టోర్నీకి సంబంధించిన కొత్త షెడ్యూల్​ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

FIFA U-17 Women's World Cup in India to be held from Feb 17 to Mar 7 next year
వచ్చే ఏడాదికి మహిళల ఫిఫా ప్రపంచకప్​ వాయిదా

భారత్​లో నిర్వహించనున్న అండర్​-17 మహిళల ఫిఫా ప్రపంచకప్​ టోర్నీ కొత్త ప్రణాళిక విడుదలైంది. ఈ టోర్నీ ఈ ఏడాది నవంబరు 2 నుంచి 21 వరకు జరగాల్సి ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా టోర్నీ నిర్వహణను 2021కు వాయిదా వేశారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు ఈ టోర్నీ నిర్వహించాలని ఫిఫా కార్యనిర్వాహక వర్గం నిర్ణయించింది. అండర్​-17 మహిళల ఫిఫా ప్రపంచకప్​ను భారత్​లో తొలిసారి నిర్వహిస్తున్నారు. దేశంలోని కోల్​కతా, గువహటి, భువనేశ్వర్​, అహ్మదాబాద్​, నవీ ముంబయిలు ఈ ప్రపంచకప్​కు వేదిక కానున్నాయి.

ఇదీ చూడండి.. కేవలం భారత ఆటగాళ్లతో ఐపీఎల్​కు సీఎస్​కే నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.