కరోనా కారణంగా దక్షిణకొరియాలో క్రీడాటోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకుండా మ్యాచ్‌లను నిర్వహించాలని ఆ దేశ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. ఆదివారం నుంచి ప్రారంభించిన కొరియన్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు షోకేజ్ బొమ్మలు ఏర్పాటు చేసుకున్నాయి క్లబ్‌లు. అందుకోసం టాయ్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ప్రేక్షకులు ఉన్నట్టుగా..
అయితే ఆ టాయ్ సంస్థకు సెక్స్ టాయ్స్ తయారు చేసే సంస్థతో సంబంధాలున్నట్లు తెలిసింది. వాటిని ప్రేక్షకులు స్టేడియంలో ఉన్నట్లుగా అనుకోవడానికి ఏర్పాటు చేసినా.. అవి శృంగార బొమ్మలని వీక్షకులు అభిప్రాయపడ్డారు. దీనిపై సోషల్‌మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది. స్టేడియంలో మొత్తం 30 బొమ్మలను ఏర్పాటు చేయగా.. అందులో 28 మహిళలు, 2 పురుషుల షోకేజ్ బొమ్మలు ఉన్నాయి. వీటిని ఏర్పాటు చేసి మహిళా ప్రేక్షకులను అవమానించారంటూ నిరసనలు జరిగాయి. ఈ విషయంపై సియోల్ ఫుట్‌బాల్ క్లబ్‌పై దాదాపు రూ.62 లక్షలను జరిమానా పడింది. దీనిపై స్పందించిన సియోల్ క్లబ్.. క్రీడాభిమానులకు, ప్రేక్షకులకు క్షమాపణలు తెలియజేసింది.
దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫీని బహిష్కరించినప్పటికీ.. కొన్ని బొమ్మలు ఎక్స్ రేటింగ్ ఉన్న వెబ్ సైట్‌లకు ప్రచారం చేస్తున్నట్లుగా కొన్ని గుర్తులు వాటిపై ఉన్నాయి.
ఇదీ చూడండి.. 'ఐపీఎల్ జరిగి తీరుతుందని కేకేఆర్ చెప్పింది'