ETV Bharat / sports

yuvraj singh: యువరాజ్​ నుంచి గుడ్​న్యూస్.. మైదానంలోకి రీఎంట్రీ! - 2011 world cup man of the series

టీమ్​ఇండియా మాజీ డాషింగ్​ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్ (Yuvraj Singh News) అభిమానులకు శుభవార్త. 2011 వన్డే ప్రపంచకప్​ విజేత యువీ.. తిరిగి మైదానంలోకి (Yuvraj Singh Comeback) అడుగుపెట్టనున్నాడు. తన రిటైర్మెంట్​ను వెనక్కు తీసుకోనున్నట్లు తెలిపాడు.

Yuvraj Singh News
యువరాజ్
author img

By

Published : Nov 2, 2021, 3:38 PM IST

టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్ యువరాజ్​ సింగ్​ రిటైర్మెంట్​ను వెనక్కు (Yuvraj Singh Comeback) తీసుకునే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం క్రికెట్​కు వీడ్కోలు పలికిన యువీ.. పబ్లిక్​ డిమాండ్​ మేరకు తిరిగి (Yuvraj Singh Return) ఆడనున్నట్లు ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​లో తెలిపాడు. దాంతో పాటే 2017 జనవరిలో ఇంగ్లాండ్​పై చేసిన 150 పరుగులకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు.

"దేవుడు మీ విధిని నిర్ణయిస్తాడు. ప్రజల కోరిక మేరకు నేను ఫిబ్రవరిలో పిచ్​ మీదకు అడుగుపెట్టే అవకాశం ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. టీమ్​ఇండియాకు మద్దతిస్తూ ఉండండి. నిజమైన అభిమాని కఠిన పరిస్థితుల్లోనే జట్టుకు అండగా నిలుస్తారు."

- యువరాజ్ సింగ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

అయితే భారత జట్టుకు ఆడతాడా, లేదా టీ20 లీగుల్లో పాల్గొంటాడా అనేది యువీ స్పష్టం చేయలేదు. 2011 ప్రపంచకప్​లో (2011 World Cup Man of The Series) ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నమెంట్​గా నిలిచిన యువరాజ్​.. 2019 జూన్​లో (Yuvraj Singh Retirement) అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలికాడు.

దేశవాళీలో..?

రిటైర్మెంట్​ను వెనక్కు తీసుకొని పంజాబ్​ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడతాడనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. 2020-21 సయ్యద్ ముస్తాక్​ అలీ ట్రోఫీ కోసం 30 మంది బృందంలో అతడి పేరు చేర్చినా.. యువీ ఆడలేదు. అంతర్జాతీయ క్రికట్ నుంచి తప్పుకొన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడాడు.

Yuvraj Singh News
యువరాజ్

టీమ్​ఇండియాలో ప్రస్థానం..

2000 అక్టోబర్​లో అరంగేట్రం చేసిన యువీ (Yuvraj Singh Stats).. దేశం తరఫున 304 వన్డేలు, 40 టెస్టులు ఆడాడు. వన్డేల్లో 8701 పరుగులు, సుదీర్ఘ ఫార్మాట్​లో 1900 పరుగులు చేశాడు. వన్డేల్లో 111 వికెట్లు కూడా తీశాడు.

ఇదీ చూడండి: Yuvraj Singh 6 Sixes: యువరాజ్​ రికార్డు.. ఫ్యాన్స్ అస్సలు మర్చిపోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.