ETV Bharat / sports

మైదానంలో కోహ్లీలా సెలబ్రేషన్.. అతడే గాడ్ ఆఫ్ క్రికెట్ అంటున్న శ్రేయాంక - శ్రేయాంక్​ పాటిల్ డబ్ల్యూపీఎల్

ACC Emerging Asia Cup 2023 : ఏసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్- 2023 ఫైనల్ మ్యాచ్​లో భారత మహిళల 'ఏ' జట్టు బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ సంచలన విజయం నేపథ్యంలో భారత మహిళా క్రికెటర్, ఆల్​ రౌండర్​ శ్రేయాంక పాటిల్​ మైదానంలో విరాట్​ కోహ్లీలా సెలబ్రేట్ చేసుకుంది.

ACC Womens Emerging Teams Asia Cup 2023 Shreyanka Patil Virat Kohli
విరాట్​ను ఇమిటేట్​ చేసిన యువ క్రికెటర్​ పాటిల్​.. కోహ్లీ ఏమైనా పూనాడా అంటూ..
author img

By

Published : Jun 22, 2023, 6:04 PM IST

ACC Womens Emerging Teams Asia Cup 2023 : హాంకాంగ్ వేదికగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించిన ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్- 2023 ఫైనల్​ మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై భారత్​ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. బుధవారం జరిగిన ఈ పోరులో భారత మహిళల 'ఏ' జట్టు బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఫైనల్​లో భారత ఆల్​రౌండర్​ శ్రేయాంక పాటిల్​ విరాట్​ కోహ్లీని ఇమిటేట్ చేస్తూ సెలబ్రేషన్​ చేసుకుంది. అహుజా బౌలింగ్‌లో శోభానా మోస్తరీ క్యాచ్ పట్టిన తర్వాత సంతోషంతో మైదానంలో విరాట్​ కోహ్లీలా సంబరాలు చేసుకుంది. ఈ గెలుపుపై ఆమె విరాట్​ను ఇమిటేట్​ చేస్తూ స్పందించిన తీరును చూసిన కొందరు నెటిజన్లు పాటిల్​లో ఏమైనా క్రికెట్​ కింగ్​ విరాట్​ కోహ్లీ పూనాడా అంటూ సోషల్​ మీడియాలో ఫన్నీగా కామెంట్స్​ పెడుతున్నారు.

మహిళల ప్రీమియర్ లీగ్​లో శ్రేయాంక పాటిల్ ఆర్సీబీ తరఫున ఆడుతోంది. విరాట్ కోహ్లీ అంటే ఆమెకు అత్యంత అభిమానం. విరాట్​ను తాను క్రికెట్ దేవుడిలా ఆరాధిస్తానని శ్రేయాంక పాటిల్ గతంలో తెలిపింది. బంగ్లాదేశ్​తో ఫైనల్ మ్యాచ్​ తర్వాత కూడా విరాట్​పై తన అభిమానాన్ని ఒలకబోసింది. కోహ్లీలా దూకుడుగా సంబరాలు చేసుకోవడంపై స్పందించింది. చిన్నప్పటి నుంచి విరాట్​ను చూసి పెరిగానని.. అందుకే దూకుడు స్వభావం ఆటోమెటిక్​గా వచ్చేసిందని చెప్పుకొచ్చింది. ఒత్తిడిలో ఆడటం అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది.

  • "I have been watching Virat Kohli since I was a kid"

    Virat is like god of cricket for me, Inspiration for millions. King 👑

    ~ Shreyanka Patilpic.twitter.com/FYedmYp95K

    — KT (@IconicRcb) June 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదిలా ఉంటే వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. భారత జట్టు తరఫున విృందా దినేశ్ 29 బంతుల్లో 36 పరుగులు, కనికా అహుజా 23 బంతుల్లో 30 పరుగులతో రాణించారు. బ్యాటింగ్​లో ఆకట్టుకోలేకపోయినా బౌలింగ్​లో మాత్రం టీమ్​ఇండియా ఆటగాళ్లు విజృంభించారు. యువ స్పిన్నర్​, ఆల్​ రౌండర్​ శ్రేయాంక పాటిల్​ మరోసారి తన బౌలింగ్​ పటిమను చూపించి నాలుగు వికెట్లు పడగొట్టింది.

అటు బ్యాటింగ్​తో ఆకట్టుకున్న అహుజా బౌలింగ్​లోనూ రాణించి 4 ఓవర్లలో 23 పరుగులుచ్చి రెండు వికెట్లు తీసింది. మన్నత్ కశ్యప్ 3 వికెట్లు, టిటాస్ సాధు ఒక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో కేవలం 96 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో నహిదా అక్తర్ (17)దే అత్యధిక స్కోరు. అద్భుత ప్రదర్శనను కనబరిచిన ఆల్​ రౌండర్​ శ్రేయాంక్​ పాటిల్​కు ప్లేయర్ ఆఫ్​ ది టోర్నమెంట్​ అవార్డు దక్కింది. 20 ఏళ్ల పాటిల్​ ఈ టోర్నమెంట్‌లోని రెండు మ్యాచ్‌లలో కేవలం 7 ఓవర్లలో 9 వికెట్లు తీసింది. ఆమె వేసిన బౌలింగ్​లో పరుగుల సగటు 1.67 పరుగులుగా ఉండగా 42 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే ప్రత్యర్థి జట్టుకిచ్చింది.

ఈ సిరీస్​లో హాంకాంగ్​తో జరిగిన లీగ్ మ్యాచ్​లో శ్రేయాంక పాటిల్​ మూడు ఓవర్లు వేసింది. ఇందులో ఓ మెయిడిన్​ చేయడమే కాకుండా రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టింది. ఆమె ఇచ్చిన రెండు పరుగులలో ఒకటి వైడ్ రూపంలోనే రావడం గమనార్హం. కాగా, ఈ టోర్నీలో భారత్​ సహా యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, పాకిస్థాన్, నేపాల్, హాంకాంగ్​ దేశాలు పాల్గొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.