ETV Bharat / sports

World cup 2023 Team India : కప్​ ముందు టీమ్‌ఇండియాకు ఓటమి నేర్పిన పాఠాలు.. ఇక అలా చేస్తే తిరుగుండదు!

World cup 2023 Team India : ప్రతిష్టాత్మక వరల్డ్​ కప్​కు ప్రాక్టీస్​లా జరిగిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్​ను టీమ్ఇండియా కైవసం చేసుకుంది. అయితే మూడో వన్డేలోనూ సత్తా చాటేందుకు రంగంలోకి దిగిన రోహిత్​ సేనకు ఘోర పరాభవం ఎదురైంది. ఆసిస్ జట్టు చేతిలో 99 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఆ ఓటమి నుంచి ఆ జట్టు నేర్చుకున్న పాఠాలు ఏవంటే ?

Ind Vs Aus ODI 2023
Ind Vs Aus ODI 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 12:43 PM IST

World cup 2023 Team India : ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్​కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్​ను టీమ్ఇండియా కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌ను ప్రపంచకప్‌ సన్నాహకం కోసం ఉత్తమంగా ఉపయోగించుకోవాలని రోహిత్​ సేన చూసింది. ఈ క్రమంలో తొలి రెండు వన్డేల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇక రెండో వన్డేలో అయితే ఏకంగా 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి అందరిని ఆశ్చర్యపరిచింది.

అయితే వర్షం అంతరాయం కారణంగా 99 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో టీమ్‌ఇండియాకు ఇక తిరుగులేదనిపించింది. కానీ మూడో వన్డేకు వచ్చే సమయానికి మరోసారి భారత జట్టు బలహీనంగా మారిపోయింది. ఈ మ్యాచ్‌ ఓటమితో జట్టు పరిస్థితి గురించి ఒక్కసారిగా బయటపడింది. అయితే ప్రపంచకప్‌కు ముందు ఈ ఓటమి జట్టుకు మేలు చేసేదే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరాజయం నుంచి వచ్చే పాఠాలు.. ప్రపంచకప్‌లో భారత్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఒక్క మ్యాచ్​ అని అనుకుంటే..
Ind Vs Aus ODi 2023 : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేలను దిగ్విజయంగా గెలిచిన టీమ్ఇండియా.. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన ఏమవుతుందిలే అని అనుకోవడానికి వీల్లేదు. ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌ కూడా ముఖ్యమే అని భావించాలి. విశ్వ విజేతగా నిలవాలంటే ప్రతి మ్యాచ్‌ను కూడా ఎంతో కీలకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రానున్న ప్రపంచకప్‌ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్లో జరగనుంది. ఈ క్రమంలో 10 జట్లు పోటీపడే టోర్నీలో.. మొదట ఒక్కో జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది.

ఈ దశలో ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. మిగతా వాటిల్లో గెలిచి ముందంజ వేయొచ్చు. ఈ దశ ముగిసే సరికి తొలి నాలుగులో ఉన్న జట్లు నేరుగా సెమీస్‌ ఆడతాయి. కానీ అక్కడి నుంచే అసలైన పరీక్ష మొదలవుతుంది. ఇక్కడ ఒక్క మ్యాచ్‌ ఓడినా సరే ఇక టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. అత్యంత తీవ్రత, ఒత్తిడి ఉండే ఈ మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టు మాత్రమే విజేతగా నిలుస్తుంది. ఈ విషయం టీమ్‌ఇండియాకు తెలియనిదేమి కాదు. 2011 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్‌.. ఆ తర్వాత వరుసగా రెండు వన్డే ప్రపంచకప్‌లోనూ సెమీస్‌లోనే ఇంటి ముఖం పట్టింది. కాబట్టి రానున్న పోరులో నిలకడ కొనసాగించడం ఎంతో ముఖ్యం.

పట్టు వదలొద్దు..
ప్రపంచకప్‌ను ముద్దాడాలంటే పట్టు వదలకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఒక మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరుతో మెప్పించి.. మరో మ్యాచ్​లో పేలవ ప్రదర్శనతో తుస్సుమనిపిస్తే ఆటకు ప్రయోజనం ఉండదు. ఛాంపియన్‌ ఆటతీరు ప్రదర్శిస్తేనే ఛాంపియన్‌గా నెగ్గుతాం.

అయితే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ అదరగొట్టింది. మొదట శుభ్‌మన్‌ గిల్‌ (104), శ్రేయస్‌ అయ్యర్‌ (105) సెంచరీలు.. కేఎల్‌ రాహుల్‌ (52), సూర్యకుమార్‌ యాదవ్‌ (72*) మెరుపులతో జట్టు 399 పరుగులకు భారీ స్కోరు చేసింది. కానీ వర్షం కారణంగా 33 ఓవర్లలో 317 పరుగులుగా లక్ష్యాన్ని కుదించగా.. ఛేదనలో ఆసీస్‌ను మన బౌలర్లు బాగా దెబ్బ కొట్టారు. ఇక అశ్విన్‌ (3), జడేజా (3), ప్రసిద్ధ్‌ కృష్ణ (2) వికెట్ల పతనాన్ని శాసించారు.

కానీ మూడో వన్డేకు వచ్చేసరికి ప్రతీకారంతో ఆసీస్‌ చెలరేగిపోయింది. మొదట బ్యాటింగ్‌లో 352 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మన బౌలర్లు తీవ్రత కొనసాగించడంలో విఫలమయ్యారు. ఆసీస్‌ బ్యాటర్లు చెలరేగుతుంటే కట్టడి చేసేందుకు విభిన్న మార్గాలను అన్వేషించడంలో భారత్‌ విఫలమైంది. మధ్యలో బుమ్రా, కుల్‌దీప్‌ కాస్త వేగాన్ని పుంజుకున్నప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది.

ఇక బ్యాటింగ్‌లో మంచి ఆరంభాలను రోహిత్‌ శర్మ (81), కోహ్లి (56), శ్రేయస్‌ అయ్యర్‌ (48) సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందుకే జట్టుకు విజయాన్ని అందించే వరకు పట్టు వదలకుండా పోరాటాన్ని కొనసాగించడం కూడా ముఖ్యం. మరోవైపు బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ తీవ్రత కొనసాగించడం ప్రధానం. అలసత్వానికి ఏ మాత్రం చోటు ఇవ్వకూడదు. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లోనూ మధ్యలో అలసిపోవడం, ఆగిపోవడం అనే మాటే ఉండకూడదు. ప్రపంచకప్‌ బరిలో దిగే మన జట్టు బలంగా ఉంది. ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో సాగితే భారత్‌ మూడోసారి వన్డే విశ్వ విజేతగా నిలవడం ఖాయం. ఆ దిశగా పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటూ సాగితే టీమ్‌ఇండియాకు తిరుగుండదు.

World Cup 2023 All Team Squad : గెట్​రెడీ క్రికెట్ ఫ్యాన్స్.. మెగాటోర్నీకి అంతా సెట్​.. 10 దేశాల తుది జట్లు ఇవే!

TeamIndia World Cup Squad : అక్షర్​ ఔట్​.. అశ్విన్ ఇన్​.. టీమ్ఇండియా వరల్డ్​ కప్​ జట్టులో మార్పులు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.