Womens Premier League 2024 Auction Date : వచ్చే ఏడాది జరగనున్న మహిళల ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌కు బీసీసీఐ సన్నాహాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా డిసెంబర్ 9న ముంబయి వేదికగా ఈ ఎడిషన్‌కు సంబంధించి వేలం నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ తెలిపింది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి విండోలో ఈ లీగ్ జరిగే అవకాశం ఉంది.
-
🥁 𝐌𝐚𝐫𝐤 𝐲𝐨𝐮𝐫 𝐂𝐚𝐥𝐞𝐧𝐝𝐚𝐫𝐬!
— Women's Premier League (WPL) (@wplt20) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🔨 #TATAWPL Auction
🗓️ 9th December 2023
📍 Mumbai pic.twitter.com/rqzHpT8LRG
">🥁 𝐌𝐚𝐫𝐤 𝐲𝐨𝐮𝐫 𝐂𝐚𝐥𝐞𝐧𝐝𝐚𝐫𝐬!
— Women's Premier League (WPL) (@wplt20) November 24, 2023
🔨 #TATAWPL Auction
🗓️ 9th December 2023
📍 Mumbai pic.twitter.com/rqzHpT8LRG🥁 𝐌𝐚𝐫𝐤 𝐲𝐨𝐮𝐫 𝐂𝐚𝐥𝐞𝐧𝐝𝐚𝐫𝐬!
— Women's Premier League (WPL) (@wplt20) November 24, 2023
🔨 #TATAWPL Auction
🗓️ 9th December 2023
📍 Mumbai pic.twitter.com/rqzHpT8LRG
అయితే వేలం నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు 11 మంది ప్లేయర్లను రిలీజ్ చేసింది. దిల్లీ క్యాపిటల్స్ కూడా కొంత మంది ప్లేయర్లను విడుదల చేసింది. అలా ఐదు టీమ్‌లు మొత్తం 29 మందిని రిలీజ్ చేశాడు. ఇక ఇప్పటికే డబ్ల్యూపీఎల్‌లో భాగమైన 60 మంది ఓవర్సీస్ ప్లేయర్లలో 21 మందిని ఐదు ఫ్రాంచైజీలు రిటైన్ చేశాయి. ఇక ప్రస్తుతం ఐదు ఫ్రాంచైజీలు 30 మంది ఆటగాళ్లను (9 మంది విదేశీ క్రికెటర్లు) దక్కించుకునేందుకు రూ.71.65 కోట్లు ఖర్చు చేయనున్నాయి.
ఫ్రాంచైజీ | పర్స్ వాల్యూ | అందుబాటులో ఉన్న స్లాట్స్ |
దిల్లీ క్యాపిటల్స్ | రూ.2.25 కోట్లు | 3 |
గుజరాత్ జెయింట్స్ | రూ.5.95 కోట్లు | 10 |
ముంబై ఇండియన్స్ | రూ.2.1 కోట్లు | 5 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రూ.3.35 కోట్లు | 7 |
యూపీ వారియర్స్ | రూ.4 కోట్లు | 5 |
WPL 2024 Auction : గతేడాది జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన కళ్లు చెదిరే ధరకు ఎంపికైంది. ఆమెను రూ. 3.40 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది. దీంతో డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌లో అత్యధిక ధరకు ఎంపికైన మహిళా క్రికెటర్‌గా తొలి స్థానంలో నిలిచింది మంధాన. ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆష్లీ గార్డనర్‌ను రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్, నాట్ స్కివర్‌ను రూ. 3.20 కోట్లకు ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేశాయి. ఇక భారత ప్లేయర్లు దీప్తి శర్మ (రూ. 2.60 కోట్లు - యూపీ వారియర్స్), జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.20 కోట్లు - దిల్లీ క్యాపిటల్స్) అత్యధిక ధర పలికిన జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
నన్ను నేనే అలా ప్రశ్నించుకునేవాడిని- అదే ఇప్పుడు సాయం చేసింది : ఇషాన్ కిషన్
వరల్డ్ కప్ ట్రోఫీకి అవమానం- మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు- జీవితకాల నిషేధం!