ETV Bharat / sports

గోడను బాది, హెల్మెట్​ విసిరి కోహ్లీ ఫ్రస్ట్రేషన్ - kohli england series 2021

ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా సారథి కోహ్లీ((kohli england tour 2021)అసహనానికి గురయ్యాడు. బలంగా గోడను బాదుతూ హెల్మెట్​ను పక్కకు విసిరాడు. ఆ వీడియో వైరల్​గా మారింది.

kohli
కోహ్లీ
author img

By

Published : Sep 6, 2021, 8:14 AM IST

Updated : Sep 6, 2021, 9:08 AM IST

టీమ్​ఇండియా సారథి కోహ్లీ(kohli england tour 2021) అసహనానికి గురయ్యాడు. ఓవల్​ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా మంచి ప్రదర్శన కొనసాగిస్తోంది. అయితే క్రీజులో కుదురుకుని అద్భుతమైన షాట్లు ఆడిన కెప్టెన్​ కోహ్లీ ఈ సారి సెంచరీ కొడతారని అభిమానులు మళ్లీ ఆశించారు. కానీ విరాట్​ 44 పరుగులు వద్ద మొయిన్​ అలీ బౌలింగ్​లో ఔటయ్యాడు. ఆఫ్​ స్టంప్​ లైన్ మీద పడిన బంతిని పుష్​ చేయగా.. ఎడ్జ్​ తీసుకుని స్లిప్​లో ఉన్న ఓవర్టన్ చేతిలోకి వెళ్లింది​.

ఈ క్రమంలోనే ఔటయ్యాక డ్రెస్సింగ్​ రూమ్​కు వెళ్తూ కోహ్లీ(Kohli england series) ఫ్రస్ట్రేషన్​కు గురయ్యాడు.​ తనపై తానే ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకున్నాడు. తీవ్ర అసహనంతో కనిపించాడతడు. బలంగా గోడను బాదుకుంటూ.. హెల్మెట్​ను పక్కకు విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది. దీనికి నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

ఈ సిరీస్​లో స్పిన్నర్​ చేతిలో తొలిసారి ఔట్ అయ్యాడు కోహ్లీ. ఇప్పటివరకు తొమ్మిది ఇన్నింగ్స్​లను ఆడిన విరాట్​ ఫాస్ట్​ బౌలర్ల చేతిలోనే వెనుదిరిగాడు. ఈ సారి మొయిన్​ అలీ ఆ బాధ్యతను తీసుకున్నాడు.

ఈ మ్యాచ్​ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్​లో ​77/0 పరుగులు చేసింది. విజయానికి ఆ జట్టు మరో 291 పరుగులు దూరంలో ఉంది. ఇక తొలి ఇన్నింగ్స్​లో 191 పరుగులకు ఆల్​ ఔట్​ అయిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్​లో 466 రన్స్​ చేసింది. ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 290 పరుగులు చేసింది.

ఇదీ చూడండి: IND vs ENG: ఇంగ్లాండ్‌ ఓపెనర్ల శుభారంభం.. ఆసక్తిగా ఐదోరోజు ఆట

Last Updated : Sep 6, 2021, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.