బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీల మధ్య ఎవరు గొప్ప కెప్టెన్(Ganguly or Dhoni Who Is The Best Captain) అని అడిగితే సగటు అభిమాని తేల్చుకోవడం చాలా కష్టం. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జట్టును ఒకరు ప్రపంచానికి కొత్తగా పరిచయం చేస్తే.. అదే జట్టును మరొకరు ప్రపంచ ఛాంపియన్‌గా(Team India Best Captain) నిలబెట్టారు. ఈ నేపథ్యంలో ఎవరినీ తక్కువ చేయడానికి కుదరదు. అయితే, ఇదే విషయంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయం వెల్లడించాడు.
"నా దృష్టిలో ఇద్దరు మాజీలు గొప్ప సారథులే! కానీ, ఎవరికి వారే ప్రత్యేకం. విపత్కర పరిస్థితుల్లో గంగూలీ టీమ్‌ఇండియాను ఏకతాటిపైకి తెచ్చాడు. నాణ్యమైన ఆటగాళ్లను ఎంపిక చేసి భారత్‌ను కొత్తగా తీర్చిదిద్దాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా విదేశాల్లో ఎలా గెలవాలో రుచిచూపించాడు. ఇక ధోనీ విషయానికి వస్తే.. అతడు కెప్టెన్సీ చేపట్టే సమయానికే భారత్ గొప్ప జట్టుగా ఉంది. అది అతడికి కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ధోనీకి కొత్త జట్టును తయారుచేయడంలో పెద్ద కష్టం కాలేదు. ఇద్దరూ గొప్పసారథులే! వ్యక్తిగతంగా నాకు గంగూలీనే అత్యుత్తమ సారథి" అని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు.
ఇదీ చూడండి.. 'ఈసారి టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా'