Virat Kohli Stumps Swap : భారత్, సౌతాఫ్రికా మధ్య హోరాహోరీగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీలు ప్రస్తుతం దూకుడుగా ఆడుతోంది.అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా రన్స్ మెషిన్ విరాట్ కోహ్లీ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
అసలేం జరిగిందంటే ?
రెండో రోజు సెకెండ్ సెషన్‌ను నిలకడగా ఆడుతున్న సఫారీలను విరాట్ కోహ్లీ తన మ్యాజిక్‌తో పెవిలియన్ బాట పట్టించాడు. అలా 93 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ఉన్న సౌతాఫ్రికా ప్లేయర్స్ డీన్ ఎల్గర్, టోని డీ జోర్జీ జోడీని జస్‌ప్రీత్ బుమ్రా ఔట్ చేశాడు. టోనీ డీ జోర్జీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే కీగన్ పీటర్సన్(2)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా 9 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ ఇద్దరూ ఔటవ్వకుముందు కోహ్లీ వికెట్ బెయిల్స్ మార్చాడు.
-
The bail-switch tactic comes into play at SuperSport Park 😅
— Wisden India (@WisdenIndia) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Virat Kohli 🤝 Stuart Broad#ViratKohli #India #SAvsIND #Cricket #Tests pic.twitter.com/mexOxQMy9d
">The bail-switch tactic comes into play at SuperSport Park 😅
— Wisden India (@WisdenIndia) December 27, 2023
Virat Kohli 🤝 Stuart Broad#ViratKohli #India #SAvsIND #Cricket #Tests pic.twitter.com/mexOxQMy9dThe bail-switch tactic comes into play at SuperSport Park 😅
— Wisden India (@WisdenIndia) December 27, 2023
Virat Kohli 🤝 Stuart Broad#ViratKohli #India #SAvsIND #Cricket #Tests pic.twitter.com/mexOxQMy9d
ప్రస్తుతం కోహ్లీ చేసిన ఈ పని నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీని చూసిన ఫ్యాన్స్ ఓ వైపు నవ్వుకంటూనే మరోవైపు 'ఏం మ్యాజిక్ చేశావయ్యా' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు ఇదే వేదికపై విరాట్ కోహ్లీ మరో ఘనతను అందుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019-25 సైకిల్‌లో రోహిత్ శర్మ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. అలా అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ సైకిల్‌లో కోహ్లీ 57 ఇన్నింగ్స్‌లో 2,101 పరుగులు సాధించారు. అయితే రోహిత్ 42 ఇన్నింగ్స్‌లలో 2,097 రన్స్ స్కోర్ చేశాడు. ఈ జాబితాలో ఛతేశ్వర్ పూజారా 1,769 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు అజింక్యా రహానే(49 ఇన్నింగ్స్‌ల్లో 1,589 పరుగులు), రిషభ్ పంత్( 41 ఇన్నింగ్స్‌ల్లో 1,575 ) తర్వాతి స్థానాల్లో నిలిచాడు.
-
Virat Kohli and South African bails - a short story 😂🙌 pic.twitter.com/gzi15TnMMc
— Rajasthan Royals (@rajasthanroyals) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Virat Kohli and South African bails - a short story 😂🙌 pic.twitter.com/gzi15TnMMc
— Rajasthan Royals (@rajasthanroyals) December 27, 2023Virat Kohli and South African bails - a short story 😂🙌 pic.twitter.com/gzi15TnMMc
— Rajasthan Royals (@rajasthanroyals) December 27, 2023
భారత్xసౌతాఫ్రికా టెస్ట్ సిరీస్- పరుగుల వరద పారించిన బ్యాటర్లు- టీమ్ఇండియాలో విరాట్ ఒక్కడే!
ఆ టెస్టు జట్టులో విరాట్‌కు నో ప్లేస్ - నెట్టింట ఫ్యాన్స్ ఫైర్!