Virat Kohli Straight Shot: ఇందౌర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. టీమ్ఇండియా బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ (68 పరుగులు), శివమ్ దూబే (63*) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో 2024లో స్వదేశంలో జరుగుతున్న తొలి టీ20 సిరీస్‌ను భారత్ 2-0 తో మరో మ్యాచ్ మిగిలుండగానే దక్కించుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్ట్రయిట్ డ్రైవ్ సహా పలు విశేషాలు నమోదయ్యాయి. అవేంటంటే?
విరాట్ స్ట్రయిట్ బౌండరీ: దాదాపు 14 నెలల తర్వాత టీ20ల్లో రీ ఎంట్రీ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో విరాట్ బాదిన స్ట్రయిట్ బౌండరీ ఛేజింగ్‌కే హైలైట్‌గా నిలిచింది. విరాట్ బాదిన ఈ షాట్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే 2022 టీ20 వరల్డ్‌కప్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ విరాట్ ఇలాగే స్ట్రయిట్ డ్రైవ్ బాదాడు. దీంతో కింగ్ మళ్లీ పాత రోజులు గుర్తుకు తెచ్చాడని నెట్టింట ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
-
1 Fluke wicket won't change the fact that Virat Kohli cooked naveen today 🐐pic.twitter.com/yNBtPF2PfM
— ` (@chixxsays) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">1 Fluke wicket won't change the fact that Virat Kohli cooked naveen today 🐐pic.twitter.com/yNBtPF2PfM
— ` (@chixxsays) January 14, 20241 Fluke wicket won't change the fact that Virat Kohli cooked naveen today 🐐pic.twitter.com/yNBtPF2PfM
— ` (@chixxsays) January 14, 2024
-
The Virat Kohli moment. 🇮🇳
— Johns. (@CricCrazyJohns) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
India needing 28 from 8 balls and then Kohli smashed this iconic six against Haris Rauf - One of the greatest shots in cricket history. pic.twitter.com/aGHwKEe0EN
">The Virat Kohli moment. 🇮🇳
— Johns. (@CricCrazyJohns) October 23, 2023
India needing 28 from 8 balls and then Kohli smashed this iconic six against Haris Rauf - One of the greatest shots in cricket history. pic.twitter.com/aGHwKEe0ENThe Virat Kohli moment. 🇮🇳
— Johns. (@CricCrazyJohns) October 23, 2023
India needing 28 from 8 balls and then Kohli smashed this iconic six against Haris Rauf - One of the greatest shots in cricket history. pic.twitter.com/aGHwKEe0EN
ఛేజింగ్‌లో@ 2000: ఈ మ్యాచ్‌లో విరాట్ ఓ అరుదైన ఘనత అందుకున్నాడు. టీ20 ఛేజింగ్‌లో 2000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. టీ20ల్లో విరాట్ ఇప్పటివరకు ఛేజింగ్‌లో 2012 పరుగులు చేశాడు. ఈ లిస్ట్‌లో ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ (2074) ముందున్నాడు. ఓవరాల్‌గా విరాట్ టీ20ల్లో 116 మ్యాచ్‌ల్లో 4037 పరుగులు చేశాడు. అందులో 1 సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అఫ్గాన్ చెత్త రికార్డు: అఫ్గాన్ స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో అత్యధిక ఎకనమీ నమోదు చేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. రషీద్ ఖాన్ గైర్హాజరీలో నూర్ అహ్మద్, మహ్మద్ నబీ, ముజీబ్ అర్ రహ్మన్ ముగ్గురు స్పిన్నర్లతో అఫ్గాన్ బరిలోకి దిగింది. 7 ఓవర్ల బౌలింగ్ చేసిన ఈ స్పిన్నర్లు 13.85 ఎకనమీతో 97 పరుగులు సమర్పించుకున్నారు.