ETV Bharat / sports

RCB new captain: ఆర్​సీబీ కొత్త కెప్టెన్ ఇతడే.. కోహ్లీ విషెస్ - RCB captain Faf du Plessis

RCB new captain: ఐపీఎల్​ 2022లో ఆర్​సీబీ కొత్త కెప్టెన్ విషయంపై సందిగ్ధత వీడింది. ఫాఫ్​ డుప్లెసిస్​కు నూతన సారథ్య బాధ్యతలు అప్పగించింది జట్టు యాజమాన్యం. ఈ విషయాన్ని ఆర్​సీబీ మాజీ కెప్టెన్ విరాట్​ కోహ్లీ వీడియో సందేశం ద్వారా వెల్లడించాడు.

RCB new captain
Faf Du plessis
author img

By

Published : Mar 12, 2022, 5:08 PM IST

Updated : Mar 12, 2022, 5:44 PM IST

RCB new captain: ఐపీఎల్​ 2022లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు​ కొత్త కెప్టెన్​ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్​ డుప్లేసిస్​కు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది జట్టు యాజమాన్యం. ఈ విషయాన్ని మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. డుప్లెసిస్​ సారథ్యంలో ఆడనుండటంపై ఆనందం వ్యక్తం చేశాడు. సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

గత సీజన్​ వరకు చెన్నై సూపర్​కింగ్స్​కు ఆడిన డుప్లెసిస్​.. నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్న తర్వాత అతడే సరైన ఎంపిక అని యాజమాన్యం భావిస్తోంది. ఫాఫ్​ పగ్గాలు అందుకోవడం వల్ల తమ కప్పు కల నెరవేరుతుందని ఆశిస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో డుప్లెసిస్​ను రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది ఆర్​సీబీ.

విదేశీ ఆటగాడిని నమ్మడం చిన్నవిషయం కాదు..

తనకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్​సీబీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు డుప్లెసిస్. "ఐపీఎల్​లో ఎన్నో మ్యాచ్​లు ఆడటం వల్ల ఆట పట్ల సరైన అవగాహన ఉంది. ఒక విదేశీ ఆటగాడిపై ఇంత నమ్మకం ఉంచడం మామూలు విషయం కాదు. దేశీయ ఆటగాళ్ల అద్భుతమైన ప్రతిభపై ఎక్కువగా ఆధారపడతా. ఇక విరాట్​ రూపంలో మాకు గొప్ప నాయకుడు ఉండనే ఉన్నాడు." అని ఫాఫ్​ అన్నాడు.

ఐపీఎల్​లో ఇప్పటివరకు 100 మ్యాచ్​లు ఆడిన డుప్లెసిస్​.. 2935 పరుగులు చేశాడు. సీఎస్​కే టైటిల్ కైవసం చేసుకున్న గత సీజన్​లో 633 పరుగులు చేశాడు.

ఇదీ చూడండి: కెప్టెన్​గా అందుకే తప్పుకొన్నా : విరాట్ కోహ్లీ

Last Updated : Mar 12, 2022, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.