ETV Bharat / sports

ధోనీ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నా: కోహ్లీ - కోహ్లీకి ధోనీ సలహా

Kohli about Dhoni advice: కెరీర్ ప్రారంభంలో ధోనీ ఇచ్చిన సలహాను ఇప్పటికీ పాటిస్తున్నానని తెలిపాడు టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. పంత్ విషయంలోనూ ఆ సలహా వర్తిస్తుందని చెప్పాడు.

Virat Kohli Dhoni, కోహ్లీ ధోనీ
Virat Kohli
author img

By

Published : Jan 11, 2022, 10:51 AM IST

Kohli about Dhoni advice: కెరీర్​ ప్రారంభంలో టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ తనకు ఓ సలహా ఇచ్చాడని తెలిపాడు ప్రస్తుత టెస్టు సారథి విరాట్ కోహ్లీ. అప్పటి నుంచి దాన్ని కచ్చితంగా పాటిస్తున్నానని అన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (0) భారీ షాట్‌కు ప్రయత్నించి అనవసరంగా వికెట్‌ పారేసుకున్నాడు. దీంతో అతడి బ్యాటింగ్‌ తీరుపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేప్‌టౌన్‌లో జరిగే మూడో టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడాడు.

"ధోనీ ఒకసారి నాకు సలహా ఇచ్చాడు. ఆటగాళ్లు చేసే పొరపాట్లు సరిదిద్దుకోవడానికి 7-8 నెలల సమయం ఇవ్వాలన్నాడు. వాళ్లు తమ తప్పులపై దృష్టిసారించినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పాడు. పంత్ విషయంలో కూడా అంతే.. ముందుకు వెళ్లేకొద్దీ తన తప్పులను సరిదిద్దుకుంటాడు. దీంతో అతడు కచ్చితంగా భవిష్యత్‌లో మంచి ప్రదర్శనలు చేస్తాడనే నమ్మకం ఉంది. ఒక ఆటగాడు తన బాధ్యత ఏంటో గుర్తించినంతకాలం.. తాను ఆడే షాట్‌ సరైందా.. లేదా? అనే విషయం అతడికి తెలుస్తుంది. మేమందరం కూడా వివిధ కారణాలతో చెత్త షాట్లు ఆడి ఔటైన సందర్భాలు ఉన్నాయి. అయితే, వాటిని అలా ఎందుకు ఆడామని గుర్తించడం కూడా ముఖ్యమైన విషయమే" అని కోహ్లీ వివరించాడు.

IND vs SA Test: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మంగళవారం నుంచి మూడో టెస్టు జరగనుంది. ఇప్పటికే సిరీస్​లో సమంగా ఉన్న ఇరుజట్లు.. ఈ మ్యాచ్​లో గెలవాలన్న పట్టుదతో ఉన్నాయి. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ ఈ మ్యాచ్​లో ఆడనున్నాడు.

ఇవీ చూడండి: ద్రవిడ్.. ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.