T20 World Cup IND Vs SA: టీ20 ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. చివరి ఓవర్ వరకు సాగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 133/9 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 137 పరుగులు చేసి విజయం సాధించింది. మార్క్రమ్ (52), డేవిడ్ మిల్లర్ (59*) అర్ధశతకాలు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు.
తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. బ్యాటింగ్లో సూర్యకుమార్ (68) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. రాహుల్ (9), రోహిత్ (15), కోహ్లీ (12), దీపక్ హుడా (0), హార్దిక్ (2), దినేశ్ కార్తీక్ (6), అశ్విన్(7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, పార్నెల్ 3, నోకియా 1 వికెట్ చొప్పున పడగొట్టారు.
ఇవీ చదవండి: T20 World Cup: ఆదుకున్న సూర్యకుమార్.. సఫారీల లక్ష్యం ఎంతంటే?
బంగ్లాదేశ్-జింబాబ్వే మ్యాచ్ ఆఖరి ఓవర్లో హైడ్రామా!.. ఇలాక్కూడా No Ball ఇస్తారా?